Jr NTR | కుమారస్వామిగా ఎన్టీఆర్… రాజమౌళి రికార్డ్స్ అన్నీ బ్రేక్ ..
Jr NTR | తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. అయితే త్రివిక్రమ్ ఇంతవరకూ టచ్ చేయని జానర్లలో పౌరాణికం ఒకటి. ఇప్పుడు ఈ జానర్‌లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ తరం కథనాయకుల్లో పౌరాణిక పాత్రలను చేయగలిగే సత్తా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో చిత్రం చేయనున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.నిజానికి ‘గుంటూరు కారం’ మూవీ తర్వాత త్రివిక్రమ్ నుండి మరో సినిమా రాలేదు. ఈ సినిమా విడుదలై ఏడాదికి పైగానే అవుతుంది. అయితే త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా బన్నీతో మూవీ చేస్తాడని అందరు అనుకున్నారు. కాని బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
దీంతో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ని ఎవరితో చేస్తాడనే చర్చ మొదలైంది. ఆ మధ్య విక్టరీ వెంకటేష్‌తో ఓ మూవీ చేయనున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మూవీ చేసేందుకు రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడని అన్నారు.మైథలాజికల్ మూవీకి సంబంధించిన స్టోరీని ఇప్పటికే ఎన్టీఆర్‌కి వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ మైథలాజికల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కు కూడా కరెక్ట్‌గా సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించబోతున్నారట.

అలాగే పౌరాణికాలు ఎన్టీఆర్‌కి NTR బాగా సెట్ అవుతాయి. యమదొంగలో కాసేపు యంగ్ యమాగా కనిపించినప్పుడు థియేటర్ దద్దరిల్లింది. ఆయన పూర్తి స్థాయి పౌరాణికం చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్నారు. దానితో పాటు త్రివిక్రమ్ -ఎన్టీఆర్‌ల ప్రాజెక్ట్ 2027కు గానీ పట్టాలెక్కదు. ఇక ఈ మైథలాజికల్ మూవీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే ఎన్టీఆర్ చేయనున్న తొలి మైథలాజికల్ డ్రామాగా ఈ సినిమా నిలవ నుంది. కుమారస్వీమి అంశను బ్యాక్ డ్రాప్‌గా తీసుకుని రాజమౌళి స్టార్డ్‌ని మించేలా ఈ సినిమాని త్రివిక్రమ్ తెరపైకి తీసుకురానున్నాడట. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదొక తిరుగులేని సినిమాగా నిలవడం ఖాయం అని అంటున్నారు.
Also Read : అందరినీ ఆశ్చర్యపరిచిన హీరోయిన్ నివేదా థామస్ లుక్..










