Teacher | ఛీ ఛీ.. విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న టీచర్..వీడియో వైరల్
Teacher | విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువుల్లో కొంతమంది ఆ బాధ్యతను విస్మరించి నీచానికి దిగజారుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి వాళ్లతో వ్యక్తిగత సేవలు చేయించుకుంటున్నారు. గురువు అనే పదానికే మచ్చ తీసుకువస్తున్నారు. కొంతమంది టీచర్లు తమ ఇంట్లో పని కూడా స్టూడెంట్స్ తో చేయిస్తుంటారు. మరికొందరు పిచ్చిపట్టినట్లు విపరీతంగా కొడుతూ సైకోలా బిహేవ్ చేస్తుంటారు.
ఇటీవల ఓ టీచర్ నెత్తికి నూనె పెట్టుకుంటూ.. పైగా పిల్లలతో హెడ్ మసాజ్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఒక టీచర్ విద్యార్థుల ముందు తరగతి గదిలో మొబైల్ ఫోన్‌లో క్లాసికల్ పాటలు ప్లే చేస్తూ తలకు మసాజ్ చేసుకుంటూ, జుట్టుకు నూనె రాసుకుంది.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని తెలిసి ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి కర్రతో కొట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మరో విషయం ఏంటంటే.. ఈ టీచరమ్మే ఈ స్కూల్ కు ప్రిన్సిపల్. ఈ విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్రాథమిక విద్యా అధికారి విచారణకు ఆదేశించారు.










