Preeti Jhangiani | అమ్మబాబోయ్.! తమ్ముడు మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.
jhangianipreeti | 1999లో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్‌తో సహా యువతను ఓ ఊపు ఊపేస్తోంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆ అందాల భామ మరెవరో కాదు ప్రతీ జింగానియా.‘యే హై ప్రేమ్’ అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళ సినిమా ‘మళవిల్లు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ‘మొహబ్బతే’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘తమ్ముడు’ సినిమాతో పాటు ‘నరసింహనాయుడు’, ‘అధిపతి’, ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్’ లాంటి చిత్రాల్లో నటించింది. అలాగే యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
చివరిగా అల్లరి నరేష్ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.హిందీ, మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాలలో నటించింది ఈ ముద్దు గుమ్మ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడే ప్రముఖ నటుడు పర్విన్ దబాస్ అనే నటుడ్నిపెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు. ఇంక అసలు విషయంలోకి వస్తే సినిమాలకి దూరమైన ప్రీతి జింగానియా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా ఫొటోస్ ని చూసి చాలా మంది షాక్ కి గురయ్యారు. ఎంతో అందంగా అప్పుడే విరబోసిన గులాబీ పువ్వుల నవనవలాడుతుండే ప్రీతి జింగానియా ముఖం అలా అయిపోయిందేంటని అనుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఆడపిల్లలు కొంచెం గ్లామర్ కోల్పోతారని తెలుసు కానీ ప్రీతి జింగానియా ఫేస్ మరీ ఇంతలా మారిపోయిందేంటని అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా న్యూ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. మీరూ ఒక లుక్ వేయండి.










