Sundeep Kishan | షాకింగ్ హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..
Sundeep Kishan |యువ కథానాయకుడు సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ (88) విశాఖపట్నంలో సోమవారంనాడు కన్నుమూశారు. జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన ఆగ్నేసమ్మ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.మె వయసు 88 సంవత్సరాలు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం, సిరిల్ వీధిలో నివాసముంటున్న ఆగ్నేసమ్మ గతంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా సేవలు అందించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, జీవితాన్ని మార్చే మార్గం చూపిన ఆమెకు స్థానికంగా మంచి పేరు ఉంది. విద్యారంగంలో ఆమె సేవలు చిరస్మరణీయం రిటైర్ అయినా.. విద్య పట్ల ఆమె అంకితభావం తగ్గలేదు.

అనేకమంది పిల్లల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఆగ్నేసమ్మ, నిజమైన గురువు అనే పేరు తెచ్చుకున్నారు. నేటి తరానికి ఆమె సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.మంగళవారం ఆమె అంత్యక్రియలు విశాఖపట్నంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో జరిగాయి. ఈ సందర్భంగా సందీప్ కిషన్ తన నానమ్మకు కడసారి నివాళులర్పించారు. తన మామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడుతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ప్రత్యేకంగా, నానమ్మ పాడెను మోస్తున్న సందీప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నిన్న మేము మా నానమ్మను కోల్పోయాము. మా తాతయ్య కృష్ణం నాయుడు షిప్ ఆర్కిటెక్ట్ అయితే, నానమ్మ ఆగ్నెస్ వైజాగ్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. 1960ల నాటి వారి మతాంతర ప్రేమ ఒక సినిమా కథలాంటిది. లవ్ యూ నానమ్మ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు సందీప్ కిషన్‌కు ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు.










