Rashmika Mandanna

Rashmika Mandanna | అతనివి అన్నీ నాకే సొంతం.. రష్మిక హాట్ కామెంట్స్ ,

Rashmika Mandanna | గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆన్‌స్క్రీన్‌ జోడీ విజయ్‌ దేవరకొండ, రష్మిక. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జోడీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయి విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు. రష్మిక, విజయ్‌ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించారు. ఈ దృశ్యాలను ఫొటోగ్రాఫర్‌లు క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లు రిలేషన్‌లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ.

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం కావడంతో విజయ్‌ ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ తాజాగా పోస్ట్‌ పెట్టారు. కుబేర టీమ్‌కు శుభాకాంక్షలు. నా కెరీర్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాలాంటి ఎంతో మంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు. నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూడడం కోసం ఆసక్తిగా ఉన్నాను అని పోస్ట్‌ పెట్టారు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్‌’తో బిజీగా ఉన్నారు. దీనితో పాటు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Rashmika Mandanna

కుబేర రిలీజ్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలకపాత్రలు పోషించిన చిత్రం కుబేరా. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎప్పుడు సినిమా ఈవెంట్ జరిగినా నటీనటులను సరదాగా ఇంటర్వ్యూ చేస్తూ ఆటపట్టించే స్టార్ యాంకర్ సుమ.. ఈ కార్యక్రమంలోనూ రష్మికను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. కొందరు హీరోల పేర్లు చెప్పి.. వాళ్ల నుంచి మీకు ఏం కావాలని ప్రశ్నించింది.

Also Read : షాకింగ్ హీరో సందీప్‌ కిషన్‌ ఇంట తీవ్ర విషాదం..

అల్లు అర్జున్ నుంచి స్వాగ్, నాగార్జున నుంచి ఛార్మింగ్, ధనుష్‌ నుంచి ఎండలో పనిచేయగల సామర్ధ్యం కావాలని చెప్పింది రష్మిక.ఆ వెంటనే విజయ్ దేవరకొండ పేరును సుమ ఎత్తగానే ఆడిటోరియం మొత్తం ఈలలు, కేకలతో దద్ధరిల్లిపోయింది. రష్మిక కూడా సిగ్గుతో మెలికలు తిరిగింది. విజయ్ నుంచి ఏం కావాలని సుమ అడగ్గా.. ఆయన నుంచి మాత్రం అన్నీ కావాలని ఏమాత్రం తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చింది రష్మిక మందన్న. దీంతో విజయ్‌తో తన రిలేషన్‌ను, ఆయనపై ఉన్న ప్రేమను పరోక్షంగా ఆమె బయటపెట్టిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..