Hyderabad

Hyderabad | రూ.5లక్షలు, 6తులాల బంగారం, బుల్లెట్ బండి..అవికూడా సరిపోక వేదింపులు ..

Hyderabad | ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, పెళ్లయిన 2నెలలకే వేధించడం మొదలుపెట్టాడు. మొదట.. నువ్వుంటే చాలన్నవాడే.. ఆ తర్వాత కట్నం కావాలంటూ టార్చర్‌ స్టార్ట్‌ చేశాడు. దాంతో, కూతురి కోసం.. అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చింది తల్లి. ఐదు లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం ముట్టజెప్పింది. అయినా, అతని.. కట్నదాహం తీరలేదు. ఇంకా ఇంకా డబ్బు తీసుకురావాలని వేధించాడు.చివరికి దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి బలవ*రణానికి పాల్పడింది. అసలు వివరాల్లోకి వెళితే.. ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని అడ్డగుట్టకు చెందిన సుష్మ(27)కు, నేరేడ్‌మెట్‌కు చెందిన గొల్లూరు అమృత్‌కు ఈ ఏడాది జనవరి 31న మ్యారేజ్ జరిగింది.

సుష్మ, ఆమె భర్త అమృత్‌ ఇద్దరూ సాఫ్ట్‌వేర్లే. ఈ పెళ్లికి సుష్మ ఫ్యామిలీ రూ.5లక్షలు, 6 తులాల బంగారం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను కట్నంగా ఇచ్చారు.అయితే ఇంత ఇచ్చినా.. పెళ్లైన కొద్ది రోజులకే అత్తంటివారు ఇంకా కట్నం కావాలని బాధితురాలిని వేధించారు. ఒక్క అత్తామామ మాత్రమే కాకుండా భర్త, మరిది అంతా కలిసి ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. దీంతో సుష్మ అనారోగ్యానికి గురై ఈ నెల 13న హాస్పిటల్‌లో చేరింది. అనంతరం ఆమెను 16వ తేదీన డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాతి రోజు సుష్మ తన ల్యాప్‌టాప్ తెచ్చుకునేందుకు తన తండ్రిని తీసుకుని అత్తగారింటికి వెళ్లింది.

Hyderabad
Hyderabad

అక్కడ అత్తంటివారు మరోసారి సుష్మతోపాటు ఆమె తండ్రిపై సూటిపోటి మాటలు విసిరారు.అదనపు కట్నం తీసుకురావాలంటూ దూషించారు. దీంతో సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం డ్యూటీకి వెళ్లి తిరిగి ఒంటిగంట వరకు ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన సుష్మ తండ్రి కంపెనీ వాళ్లకు ఫోన్‌ చేసి అడగగా.. ఆమె 8.30 గంటలకు వెళ్లిపోయిందని తెలిపారు. వెంటనే ఆయన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు దుర్గం చెరువులో ఓ మహిళ డెడ్ బాడీ దొరికిందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ డెడ్ బాడీ సుష్మదిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా తరలించారు.

Also Read : అతనివి అన్నీ నాకే సొంతం.. రష్మిక హాట్ కామెంట్స్ ,

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..