Kubera Movie Review

Kubera Movie Review | ‘కుబేర’ మూవీ రివ్యూ & రేటింగ్ ..?

Kubera Movie Review | ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో తమిళ నటుడు ధనుశ్‌, సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని, నటి రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ, ధనుశ్‌, నాగార్జున వంటి స్టార్ నటీనటులు ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం ఆటల నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.అయితే ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Kubera Movie Review
Kubera Movie Review

కథ

దేవా (ధనుష్) ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను.. బిచ్చగాడిగా మారతాడు. తిరుపతిలో అడుక్కుంటూ జీవిస్తున్న అతణ్ని నీరజ్ చోప్రా (జిమ్ సర్భ్) అనే పెద్ద వ్యాపారవేత్తకు చెందిన మనుషులు తీసుకెళ్తారు. దేవాతో పాటు ఇంకో ముగ్గురు బిచ్చగాళ్లను ఒక పెద్ద కుంభకోణానికి పావులుగా వాడుకోవాలని అనుకుంటాడు నీరజ్. తన చేతికి మట్టి అంటకుండా ఈ పనిని పూర్తి చేసే బాధ్యతను మాజీ సీబీఐ అధికారి అయిన దీపక్ (నాగార్జున)కు అప్పగిస్తాడు నీరజ్.

Also Read : రూ.5లక్షలు, 6తులాల బంగారం, బుల్లెట్ బండి..అవికూడా సరిపోక వేదింపులు ..

వాళ్లు అనుకుంటున్న పని సాఫీగా సాగిపోతున్న సమయంలో.. చిన్న ఇబ్బంది తలెత్తి దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. దీంతో మొత్తం గందరగోళం నెలకొంటుంది. ఇంతకీ బిచ్చగాళ్లతో నీరజ్ మనుషులు చేయించాలనుకున్న పనేంటి.. సీబీఐ అధికారిగా పని చేసిన దీపక్ ఇలాంటి పనిలో ఎందుకు భాగం అయ్యాడు.. ఇంతకీ దేవా వీళ్లకు దొరికాడా లేదా? వాళ్ల మిషన్ ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

Kubera Movie Review
Kubera Movie Review

నటి నటులు సాంకేతిక విభాగం

ఈ సినిమాకు సంబంధించి నటి నటులు సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే..నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయారు. నిజాయితీగా బతకాలనుకుని.. తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నాగ్ కనిపించారు.అలాగే బెగ్గర్‌గా కనిపించిన ధనుష్ తన నటనతో ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. దేవ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం. ధనుష్ నటన ఆ స్థాయిలో ఉంది. హీరోయిన్ గా రష్మిక మందన్నా మరోసారి అద్భుతమైన నటనను కనబరిచింది.సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు.

Kubera Movie Review
Kubera Movie Review

మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ, కొన్నిచోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్‌ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.

Also Read : అతనివి అన్నీ నాకే సొంతం.. రష్మిక హాట్ కామెంట్స్ ,

చివరిగా ఓవరాల్ గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.అలాగే శేఖర్ నుంచి ఇలాంటి హార్డ్ హిట్టింగ్ డ్రామాను ఊహించలేం. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అతను అందించిన సర్ప్రైజ్ ఇది. రైటింగ్.. టేకింగ్.. అన్నింట్లోనూ ఒక ఇంటెన్సిటీ చూపించాడు శేఖర్. తన కెరీర్లో ఎంతో వైవిధ్యమైన.. అలాగే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘కుబేర’ నిలుస్తుంది.

రేటింగ్‌: 3/5

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..