Muraga Book

Muraga Book | ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ పుస్తకం.. గాడ్ ఆఫ్ వార్ కోసం ఎన్టీఆర్ రెడీ.

Muraga Book | జూనియ‌ర్ ఎన్టీఆర్(jr.ntr) ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్(prasanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ బ‌రువు త‌గ్గి స్లిమ్ గా త‌యారయ్యాడు. త‌న కెరీర్లో మునుపెన్న‌డూ లేనంత స్టైలిష్ గా నీల్(neel) సినిమా కోసం ఎన్టీఆర్ మారాడు. దీంతో ఈ లుక్ లో ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవెల్ లో ప్రెజెంట్ చేయ‌బోతున్నాడ‌ట నీల్.సాధార‌ణంగా కాస్త బొద్దుగా క‌నిపించే తార‌క్(tarak) నీల్ మూవీ కోసం చాలా కిలోల బ‌రువు త‌గ్గాడు. ఎన్టీఆర్ ఇంత స్లిమ్ గా మార‌డం చూసి అంద‌రూ ఎంతో షాక‌య్యారు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఎన్టీర్ మేకోవ‌ర్ అవాల్సి ఉంద‌ని తెలుస్తోంది.

కానీ ఈసారి ఎన్టీఆర్ మేకోవ‌ర్ కావాల్సింది నీల్ సినిమా కోసం కాదు, నీల్ మూవీ పూర్త‌య్యాక తార‌క్ చేయ‌బోయే త్రివిక్ర‌మ్(trivikram) మూవీ కోసం.హిందూ పురాణాల్లోని ఒక దేవుడైన కుమార స్వామికి సంబంధించిన క‌థ‌గా ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్టు నిర్మాత నాగ వంశీ(naga vamsi) ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలోని క్యారెక్ట‌ర్ కోసం ఎన్టీఆర్ మ‌రోసారి భారీగా మేకోవ‌ర్ చేయాల్సి ఉంద‌ని అంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్ట్ లో మీడియా కంటికి కనిపించారు అయితే ఈయన చేతిలో “మురుగ పుస్తకం” (Muraga Book)పట్టుకొని కనిపించడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Muraga Book
Muraga Book

సాధారణంగా ఎన్టీఆర్ బయట ఎక్కడైనా కనిపించిన చేతిలో పుస్తకంతో కనిపించిన సందర్భాలు ఎక్కడా లేవు. కానీ మొదటిసారి ఈయన మురుగ పుస్తకం పట్టుకొని కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో చేయబోయే ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కుమారస్వామి కథతో సినిమా రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగ వంశీ కూడా ఓ సందర్భంలో వెల్లడించారు.

టూ వీలర్లకూ టోల్ ఫీజు.. మంత్రి షాకింగ్ కామెంట్స్ ,

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..