Rain Alert AP | మరో 3 రోజుల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక,
Rain Alert AP | ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు త్వరలో తీవ్రంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.వర్షాల కారణంగా జలగర్భత పరిస్థితులు, తడిచిన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడవచ్చని APSDMA సూచించింది.
గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.వానల సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.ఇవాళ్టి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున, నీటి మిగులే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

29వ తేదీన మరో అల్పపీడనం
ఇటివల నైరుతి రుతుపవనాల విస్తరణ నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షపాతం మళ్లీ ఊపందుకుంది.వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముండగా, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.అంతేగాక, ఈ నెల 29వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Also Read : Kannappa Review | కన్నప్ప సినిమా రివ్యూ అండ్ రేటింగ్,










