Swetha Votarkar | షాకింగ్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య..
Swetha Votarkar | ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ వోటార్కర్(40) అనుమానస్ప స్థితిలో మృతి చెందారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపిన వివరాల మేరకు చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఫ్యానుకు లుంగీతో ఉరేసుకున్న స్థితిలో చనిపోయింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు సహా పూర్ణచందర్ రావుతో కలిసి ఉంటున్నారని సమాచారం. అతనితో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్వేచ్చకు 9వ తరగతి చదువుతున్న ఒక కూతురు ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.స్వేచ్ఛ ఆత్మహత్య పై ఆమె తండ్రి శంకర్ మాట్లాడుతు నా కూతురు ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. ఆ తర్వాత తన కూతురితో కలిసి పూర్ణ చంద్ర తో ఉంటుంది. పెళ్లి చేసుకోమంటే మాత్రం తిరస్కరించాడు.

ఈ నెల 26 స్వేచ్ఛ ఫోన్ చేసి నాన్న అతనితో ఉండలేకపోతున్నానని చెప్పింది. కానీ ఇంతలోనే నా కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నా కూతురు చావుకి పూర్ణ చంద్ర రావే కారణం. అతనికి వేరే మహిళలతో సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకొనే రోజు ఇనిస్టాగ్రమ్(Instagram)లో ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్ చేస్తు ‘మనస్సు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అనే కొటేషన్ తో బుద్ధుడు లాగా కూర్చున్న పిక్ ని షేర్ చేసింది. లవ్, శాంతి, మెడిటేషన్, నేచుర్, ప్రశాంతత వంటి హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ఒక వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని ఉన్న పిక్ ని కూడా షేర్ చేసింది.
Also Read : చీరలో సెగలు పుట్టిస్తున్న వైష్ణవి










