Shafali Jariwala

Shafali Jariwala | షాకింగ్ .. గుండెపోటుతో బాలీవుడ్ నటి కన్నుమూత.

Shafali Jariwala | బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందింది.సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమెకు ఇన్ స్టాలో ఏకంగా 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావటంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.వివరాల్లోకి వెళితే.. కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) హఠాన్మరణం చెందారు. నిన్న రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సల్మాన్ ఖాన్ సినిమా ముజ్సే షాదీ కరోగా చిత్రంలో ఒక పాత్రను సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత ఆమె పలు టీవీ రియాల్టీ షోలలో మెరిసారు.వెబ్ సీరిస్ లోనూ నటించారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 13లోనూ ఆమె ఎంట్రీ ఇచ్చారు.2015లో ఆమె పెళ్లి చేసుకున్నారు.సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమెకు ఇన్ స్టాలో ఏకంగా 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావటంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆమె ఆకస్మిక మరణాన్ని అభిమానులు.. ఇండస్ట్రీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆమె మరణంపై సింగర్ మికా సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను షాక్ కు గురి చేసినట్లుగా పేర్కొన్నారు.

Shafali Jariwala
Shafali Jariwala

అనుమానాలు

అలాగే ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షఫాలీ జరివాలాను ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బెల్లేవ్ ఆస్పత్రి సిబ్బంది సమాచారం ప్రకారం షఫాలిని హాస్పిటల్ కు తీసుకువచ్చే సమయానికే ఆమె మరణించింది. ఈమె అంధేరిలోని ఆమె నివాసంలో ఉంటుంది. ఆమె మరణానికి గల కారణం ఇంకా తెలియలేదని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్ లో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద ఘటనగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త పరాగ్ త్యాగి వాంగ్మూలాన్ని సేకరించామని చెప్పారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..