Ileana D’Cruz

Ileana D’Cruz | రెండోసారి తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. తండ్రి ఎవరంటే?

Ileana D’Cruz | టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా త‌మిళ, హిందీ చిత్ర‌సీమ‌లోను అగ్రహీరోల స‌ర‌స‌న న‌టించింది. మహేష్ బాబుతో కలిసి నటించిన పోకిరి సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఈమూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియానా పేరు మారుమోగింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ.. రెండు ద‌శాబ్ధాల కెరీర్ ర‌న్ త‌ర్వాత ఈ గోవా బ్యూటీ జీవితంలో ఊహించని మలుపుల గురించి తెలిసిందే. విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ త‌ర్వాత తీవ్ర‌మైన డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది.

ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు మ‌ళ్లీ కెరీర్ ప‌రంగా కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నించినా ఆశించిన బ్రేక్ అందుకోలేక‌పోయింది.ఆ త‌ర్వాత స‌డెన్ గా బిడ్డ‌కు త‌ల్లిన‌వుతున్నాను! అంటూ తొలి గ‌ర్భాన్ని ప్ర‌క‌టించింది. ఆ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో కూడా చాలా కాలం పాటు దాచి ఉంచింది. అత‌డు మైఖేల్ డోల‌న్.. విదేశీ ప్రియుడు.. పైగా శ్వేత‌జాతీయుడు.. డోల‌న్ అప్పుడ‌ప్పుడు అతిథిలా ఫోటోల్లో క‌నిపిస్తాడు త‌ప్ప బాలీవుడ్ స‌ర్కిల్స్ లో పెద్ద‌గా క‌నిపించ‌డు.

Ileana D’Cruz
Ileana D’Cruz

అయితే తాజాగా ఇలియానా రెండో సారి తల్లి అయినట్లు ఆమె వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన కుమారుడి ఫోటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఇలియానా.. ఆ బుబ్జాయికి ‘కియాను రఫే డోలాన్’ అని పేరు పెట్టామని.. అతన్ని పరిచయం చేస్తున్నందుకు తమ హృదయాలు ఆనందంతో నిండిపోయాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇలియానాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..