BSNL

BSNL | ఇంటికే ఫ్రీగా సిమ్‌ కార్డుల డోర్‌ డెలివరీ.. ఎలా చేసుకోవాలంటే ..?

BSNL | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్ల సౌకర్యార్థం కొత్త సేవను ప్రవేశపెట్టింది. ఇకపై కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే, సొంత ఇంటికి సిమ్‌ కార్డులను డెలివరీ చేయించుకునే అవకాశం కల్పించింది. సెల్ఫ్‌ కేవైసీ (Self KYC) ప్రక్రియ ద్వారా కస్టమర్లు తమ పేరుతో సులభంగా సిమ్‌ కార్డు పొందవచ్చు. ఈ కొత్త సేవలో భాగంగా, బిఎస్ఎన్ఎల్ తమ అధికారిక పోర్టల్‌లో సిమ్‌ కార్డు డెలివరీ కోసం ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచింది. కస్టమర్లు ఈ లింక్‌ను క్లిక్‌ చేసి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సులభమైనది మరియు సమయం ఆదా చేసే విధంగా రూపొందించబడింది. కేవైసీ పూర్తయిన తర్వాత, బిఎస్ఎన్ఎల్ సిమ్‌ కార్డు నేరుగా కస్టమర్‌ ఇంటికి డెలివరీ అవుతుంది.

BSNL
BSNL

ఈ సేవతో కస్టమర్లు సమయం మరియు శ్రమను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ విధానంలో జరుగుతుంది కాబట్టి, పారదర్శకత మరియు వేగవంతమైన సేవలను అందించడంలో బిఎస్ఎన్ఎల్ మరో ముందడుగు వేసింది. ఈ సేవకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా సమాచారం కోసం కస్టమర్లు BSNL యొక్క టోల్‌-ఫ్రీ నెంబర్ 1800 180 1503ని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ద్వారా సిమ్‌ కార్డు డెలివరీ, కేవైసీ ప్రక్రియ, లేదా ఇతర సేవల గురించి పూర్తి వివరాలను పొందవచ్చు.

సెల్ఫ్ KYC సౌకర్యం :

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు వెబ్‌సైట్‌లో నేరుగా KYC ప్రక్రియను పూర్తి చేసే సౌలభ్యాన్ని అందిస్తోంది. సిమ్ కార్డు ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు (https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/) లింక్‌ను విజిట్ చేయాలి. ఆపై KYC ప్రక్రియను పూర్తి చేయొచ్చు.ఈ సర్వీసు కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లు రెండింటికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు పిన్ కోడ్, పేరు, అల్ట్రానేట్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. కుటుంబ సభ్యునికి లేదా ఎవరికి కొత్త సిమ్ కావాలో ఆప్షన్ ఎంచుకోవచ్చు.

BSNL
BSNL

జూన్ 2025 చివరి నాటికి లక్ష 4G సైట్‌లను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో మొబైల్ వినియోగదారుల నగరాలకు 5G సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇటీవలే ఎంపిక చేసిన నగరాల్లో Q-5G FWA సర్వీసులను ప్రవేశపెట్టింది.అతి త్వరలో మరిన్ని ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురానుంది. 100Mbps స్పీడ్‌తో నెలకు ధర రూ. 999 నుంచి ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే.. BSNL సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.

పూట గడవక భిక్షాటన చేస్తున్న ఒకప్పటి స్టార్ న‌టి పాకీజా..

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..