APCPDCL

APCPDCL | నేడే చివరి రోజు.. విద్యుత్ బిల్లుపై 50% తగ్గింపు..ఎలా కట్టాలి అంటే..?

APCPDCL | ప్రస్తుతం విద్యుత్ శాఖ కొత్త విధానం ప్రకారం.. కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువగా వినియోగం ఉన్న వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తోంది. ఈ నోటీసుల్లో అదనపు లోడ్ ఛార్జీలను చెల్లించాలని లేదా లోడ్‌ను క్రమబద్ధీకరించాలని సూచిస్తోంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లోడ్‌ను క్రమబద్ధీకరించే వారికి 50 శాతం రాయితీ ఇస్తూ, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని చెబుతోంది. ఒకవేళ వినియోగదారుడు స్పందించకపోతే మొత్తం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.దాహరణకు ఒక కిలోవాట్‌ లోడుతో కనెక్షన్‌ తీసుకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.200, డెవలప్‌మెంట్‌ చార్జీ కింద సుమారు రూ.2,250, దర ఖాస్తుకు రూ.200 చొప్పున చెల్లించాలి. ఇదే రెండు వాట్ల లోడ్‌కు డెవలప్‌ మెంట్‌ చార్జీ కింద రూ.4,600 కట్టాలి.

APCPDCL
APCPDCL

పరిమితికి మించి

ఇదే మాదిరి ఐదు కిలోవాట్ల వరకూ నిర్ణీత రుసుం చెల్లించాలి. కాగా చాలామంది ఒక కిలోవాట్‌లోడుకు కనెక్షన్‌ తీసుకుంటున్నారు. తక్కువ లోడు చూపుతూ.. అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. గ్రామాల్లో సైతం బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరుగుతున్నాయి. చాలామంది రెండు అంతస్తుల భవనాలు నిర్మించి.. విద్యుత్‌ కనెక్షన్‌ మాత్రం ఒక్కటే తీసుకుంటున్నారు. ఏసీలు, కూలర్లు, గ్రీజర్లు వాడుతూ.. వారు తీసుకున్న కిలోవాట్ల పరిమితికి మించి లోడ్‌ వినియోగిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు దాడుల సమయంలో అదనపు లోడును గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.

Also Read : ఇంటికే ఫ్రీగా సిమ్‌ కార్డుల డోర్‌ డెలివరీ.. ఎలా చేసుకోవాలంటే ..?

అపరాధ రుసుము విధిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది లోడ్‌ క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. అవసరానికి మించి విద్యుత్‌ వినియోగం కారణంగా లోడ్‌ పెరిగి.. ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ పాడైపోతున్నాయి. ఫ్యూజులు పోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లోనూ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచేలా.. విద్యుత్‌ వినియోగం లోడు క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం 50 శాతం రాయితీ కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రాయితీ దక్కాలంటే జూన్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

APCPDCL
APCPDCL

రాయితీ వర్తింపు ఇలా..

  • కిలోవాట్‌ 2,250 1,250
  • రెండు 4,450 2,450
  • మూడు 6,650 3,650
  • నాలుగు 8,850 4,850
  • ఐదు 11,050 6,050

ఎలా కట్టాలి అంటే

సైట్ లింక్ లోకి వెళ్ళి మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది https://apcpdcl.in/CSC_Complaints/vAdL

విద్యుత్ లోడ్ భారం అంటే

కనెక్టెడ్ లోడ్: ఒక గృహంలో, సంస్థలో విద్యుత్ కనెక్షన్‌కు అనుసంధానమైన అన్ని పరికరాల (ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, టీవీలు మొదలైనవి) మొత్తం శక్తి సామర్థ్యం. ఉదాహరణకు ఒక ఇంట్లో 5 ఫ్యాన్లు (ఒక్కొక్కటి 75 వాట్లు), 4 ట్యూబ్‌లైట్లు (ఒక్కొక్కటి 40 వాట్లు), 1 టీవీ (200 వాట్లు) ఉంటే.. కనెక్టెడ్ లోడ్ = (5×75) + (4×40) + 200 = 735 వాట్లు లేదా 0.735 కిలోవాట్లు.కాంట్రాక్టెడ్ లోడ్: విద్యుత్ సరఫరా సంస్థతో వినియోగదారుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం అనుమతించిన గరిష్ఠ లోడ్. ఇది వినియోగదారుడు ఉపయోగించవచ్చని నిర్ణయించిన శక్తి పరిమితి. ఉదాహరణకు ఒక గృహం 2 కిలోవాట్ల కాంట్రాక్టెడ్ లోడ్‌ను ఎంచుకుంటే, అంతకు మించి వినియోగం ఉంటే అదనపు ఛార్జీలు లేదా జరిమానా విధించబడవచ్చు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..