Actor Pragathi | వాడి వల్లే హీరోయిన్ అవ్వాల్సింది.. చివరికి తల్లి అయ్యాను.. నటి ప్రగతి.
Actor Pragathi | నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రగతి ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్.. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు. అంతేకాదు సినిమల్లో హీరోలకు అమ్మగా.. అత్తగా.. వదినగా.. నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ప్రగతి. ప్రగతి కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన వీట్ల విశేషంగా అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా సినీ కెరీర్‌ను మొదలు పెట్టి విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె ఇటు తెలుగులో నటిస్తూనే.. అటు తిమళ్, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ వావ్ అనిపిస్తున్నారు.

వెయిట్ లిఫ్ట్
ఇలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్లు చేస్తూ కష్టపడుతున్నారు.ఇలా ఫిట్నెస్ కోసం ఈమె నాలుగు పదుల వయసులో కూడా తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా అధిక బరువులు ఎత్తుతూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పోటీలలో కూడా ఈమె వెయిట్ లిఫ్ట్ లో భాగంగా కాంస్య పథకాన్ని కూడా సాధించిన సంగతి మనకు తెలిసిందే.
Also Read : పూట గడవక భిక్షాటన చేస్తున్న ఒకప్పటి స్టార్ నటి పాకీజా..
నేను తల్లి అయ్యాను
ఇలా సినిమాలకు కాస్త దూరమైనటువంటి ప్రగతి జిమ్ లోనే భారీగా కష్టపడుతున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినిమా కెరియర్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఒక వ్యక్తి సలహా వల్ల తాను చిన్న వయసులోనే తల్లిగా మారాల్సి వచ్చింది అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలపై ఆసక్తితో తాను హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగడం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. అయితే ఒక వ్యక్తి సలహా కారణంగా తాను హీరోయిన్ ఛాన్సులు వదులుకోవాల్సి వచ్చింది.

హీరోయిన్ గా నటిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేమని అలాగే అవకాశాలు కూడా చాలా తక్కువగా వస్తాయని తెలిపారు. అలాగే తల్లి పాత్రలలో అయితే కనుక ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగవచ్చు అంటూ సలహా ఇవ్వటం వల్ల తాను హీరోయిన్ గా కాకుండా తల్లి పాత్రలలో నటించడానికి సిద్ధమయ్యానని అలా చిన్న వయసులోనే తాను తల్లి పాత్రలలో నటించాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా ప్రగతి (Pragathi) తెలిపారు.










