Kannappa Collections | ఏంటి అరాచకం సామి .. కన్నప్ప వీకెండ్ కలెక్షన్స్ ఎన్నికొట్లో తెలుసా .
Kannappa Collections | మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం వంటి అగ్రనటులు కీలకపాత్రలు పోషించారు. స్టీఫెన్ దేవస్సి సంగీత సారథ్యం వహించగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కన్నప్ప చిత్రాన్ని డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం విడుదలైంది.నిజానికి సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రూ.200 కోట్ల వ్యయంతో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

కన్నప్ప.. మొదటి రోజు 20 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసిందని తెలుస్తోంది. రెండో రోజు 22.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అలా ఇప్పటివరకు రెండు రోజులు కలిపి 42.5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు వినికిడి. త్వరలో రూ.50 కోట్ల క్లబ్ లో చేరనుందని టాక్ వినిపిస్తోంది.హిందీలో 1.5 కోట్ల రూపాయలు, కన్నడంలో 10 లక్షల రూపాయలు, తమిళంలో 35 లక్షల రూపాయలు, మలయాళంలో 35 లక్షల రూపాయలు రాబట్టింది.
Also Read : విద్యుత్ బిల్లుపై 50% తగ్గింపు..ఎలా కట్టాలి అంటే..?
ఇండియా వైడ్ రెండ్రోజుల్లో 17 కోట్ల రూపాయల నెట్, 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.హైదరాబాద్‌లో 387 షోలు, బెంగళూరులో 296 షోలు, విజయవాడలో 81 షోలు, విశాఖలో 106 షోలు, చెన్నైలో 55 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఆదివారం కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఎక్స్‌లెంట్ హోల్డ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు.. కర్ణాటక, కేరళ, తమిళనాడులో రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

| నైజాం | 5.19 cr |
| సీడెడ్ | 1.88 cr |
| ఉత్తరాంధ్ర | 1.75 cr |
| ఈస్ట్ | 0.97 cr |
| వెస్ట్ | 0.73 cr |
| గుంటూరు | 0.77 cr |
| కృష్ణా | 0.70 cr |
| నెల్లూరు | 0.67 cr |
| ఏపీ+తెలంగాణ | 12.66 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.56 cr |
| ఓవర్సీస్ | 2.05 cr |
| వరల్డ్ టోటల్ | 18.27 cr (షేర్) |










