PF Interest

PF Interest | ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగంటే..?

PF Interest | ఈపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే వడ్డీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ నిల్వలపై 8.25 శాతం వడ్డీని ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే, ఈ వడ్డీ సొమ్ము ఖాతాల్లో జమ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో చందాదారుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ జమ ఆలస్యం కావడం వల్ల ఏదైనా నష్టం వాటిల్లుతుందా అని కొందరు ఆందోళన చెందుతున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

PF Interest
PF Interest

సుమారు మూడు నెలల పరిశీలన అనంతరం, మే 24న కేంద్రం ఈ సిఫార్సును ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే, ఈ వడ్డీ సొమ్ము ఎప్పటిలోగా ఖాతాల్లో జమ అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిపుణుల అంచనా ప్రకారం, దీనికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వడ్డీ జమ ఆగస్టు-సెప్టెంబర్ నెలల మధ్య జరిగింది. ఈసారి అంత జాప్యం జరగకపోయినా, మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.

Also Read : నేడే చివరి రోజు.. విద్యుత్ బిల్లుపై 50% తగ్గింపు..ఎలా కట్టాలి అంటే..?

తెలుసుకోవడం ఎలాగంటే..

ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ కావడంపై ఈపీఎఫ్ఓ వివరణ ఇచ్చింది. ‘ఈపీఎఫ్ఓ ఖాతాల్లో జమ చేసిన వివరాలు త్వరలో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయి. ఒకసారి వడ్డీ జమ అయితే తర్వాత పూర్తిగా జమ అయిన తర్వాత మీ ఖాతాలో కనిపిస్తుంది. సంయమనం పాటించండి’ అని ఈపీఎఫ్ఓ వివరణ ఇచ్చింది.ఈఫీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిన తర్వాత వారీ పీఎఫ్ ఖాతాల్లో ఆ వివరాలు చూసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పలు పద్దతులు ఉన్నాయి.గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఈపీఎఫ్ఓ యాప్ లో రిజిస్టర్ కావాలి.సర్వీస్’ విభాగంలోకి వెళ్లి .. ఎంప్లాయి సెంట్రిక్ సర్వీస్.. ‘వ్యూ పాస్ బుక్’ ఎంచుకోవాలి.

PF Interest
PF Interest

ఓటీపీ వెరిఫికేషన్ తోపాటు తదుపరి వచ్చే సూచనలకు అనుగుణంగా ముందుకెళితే మీ ఈపీఎఫ్ పాస్ బుక్ ఓపెన్ కావడంతోపాటు అందులో ఎంత బ్యాలెన్స్ అవుతుందో తెలుస్తుంది.ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘అవర్ సర్వీసెస్’ .. అటుపై ‘ఫర్ ఎంప్లాయీస్’ సెక్షన్ ఎంచుకోవాలి. అక్కడ ‘మెంబర్ పాస్‌బుక్ ఓపెన్ చేయాలి. అటుపై సర్వీసెస్ లోకి వెళ్లి మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.యూఏఎన్ ఖాతాతో లింక్డ్ చేసి ఉంటే.. మీ కంట్రిబ్యూషన్, పీఎఫ్ బ్యాలెన్స్ కోసం 7738299899 అనే నంబర్‌కు EPFOHO UAN ENG ఎస్ఎంఎస్ పంపాలి.. ENG భాషకు ప్రాతినిధ్యం వహిస్తుంది.రిజిస్టర్డ్ యూజర్లు 011-22901406 ఫోన్ నంబర్‫కు మీ రిజిస్టర్ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ చేయాలి. తర్వాత పాన్ కార్డ్ నంబర్, ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్ తెలియజేస్తే ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుస్తాయి. దీనికి ఎటువంటి చార్జీ విధించరు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..