Weather Update | ఇప్పట్లో వదిలేలాలేవుగా.. మరో రెండు రోజులు వానలే వానలు..
Weather Update | విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం ఏర్పడే అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై కూడా ప్రభావం చూపనుంది. దీని కారణంగా ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని,
సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రస్తుతం మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. నిన్న సాయంత్రం మొదలైన వర్షం అర్దరాత్రి వరకు కొనసాగింది… ఇది ఇవాళ కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శివారులోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటిచింది.

రుతుపవనాల ప్రభావంతో కురిసే ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రజలు తమ పట్ల, తమ ఆస్తుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో మురుగునీటి వ్యవస్థలపై ఒత్తిడి పెరిగి, కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడవచ్చు. రైతులు తమ పంటలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగంటే..?










