YS Jagan Padayatra

YS Jagan Padayatra | 2.0 మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్న జగన్..ఎప్పటినుండి అంటే ?

YS Jagan Padayatra | వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.మునుపటి దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. ఇటువంటి సమయంలో పార్టీని కాపాడుకునేందుకు సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. తాడో పేడో అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెంపొందించడం ఒకవైపు.. పార్టీని బలోపేతం చేయడం ఇంకోవైపు.. 2029 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం మరోవైపు అన్నట్టు.. జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉంటున్నాయి.

వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా ఆయన వ్యూహాలు ఉన్నాయి. తాజాగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులను ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలను చూసిన తర్వాత తాను మారక తప్పదని వ్యాఖ్యానించారు. తనకోసం మద్దతుగా నిలిచిన వారిని వేధిస్తున్నారని.. అటువంటి వారికి అండగా నిలబడతానని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పనిలో పనిగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

YS Jagan Padayatra
YS Jagan Padayatra

వచ్చే ఏడాది ప్లీనరీ నిర్వహణతో పాటు పాదయాత్ర 2.0 ఉంటుందని ప్రకటించారు.2019 ఎన్నికలకు ముందు ఉన్న వాతావరణం క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఒకవైపు పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను వైయస్సార్ కాంగ్రెస్ వైపు టర్న్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పట్లో వదిలేలాలేవుగా.. మరో రెండు రోజులు వానలే వానలు..

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..