Fish Venkat | నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. అసలు ఏం జరిగినది అంటే..?
Fish Venkat | ఫిష్ వెంకట్ ‘సమ్మక్క సారక్క’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంతో సినిమాలు తగ్గించేశారు. అవకాశాలు వస్తున్నా.. సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు.అది పక్కన పెడితే గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్, ఇటీవల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి. గతంలో డయాలసిస్ చేయించుకుని కొంత కోలుకున్నప్పటికీ, ఇప్పుడు సమస్య మళ్లీ తీవ్రమైందని తెలుస్తోంది.అయితే తాజాగా ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకు వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సదరు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌ను అడుగగా..

తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఈ పరిస్థితి వచ్చిన ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోలేదని తనకి ఇద్దరు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల ఉన్నారనీ, మగపిల్లలు డబ్బు పరంగా ఎలాంటి సాయం చేయడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక ఫిష్ వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న నెటిజన్లు చలించిపోతున్నారు. ఫిష్ వెంకట్‌కు సాయం చేయడంటూ ప్రభుత్వంతో పాటు తెలుగు హీరోలకు సందేశాలు పెడుతున్నారు.
Also Read : అప్పట్లో డాక్టర్ కావాలని కలలు కన్న అందమైన నటీమణులు వీళ్ళే..










