Sunaina | కుబేరలో నాగార్జున భార్య బయట మతిపొగిడుతుంది భయ్యా.. మీరు చూడండి.
Sunaina | దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు ధనుశ్ కలయికలో వచ్చిన చిత్రం ‘కుబేర’. కింగ్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎమోషనల్ కంటెంట్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేశారు. చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ మూవీకి తమిళంలో కన్నా తెలుగులో ఎక్కువ ఆదరణ దక్కడం విశేషం. ధనుష్ లాంటి యాక్టర్ ఉన్నా కూడా ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు ఎందుకో తిరస్కరించారు. ధనుష్ లాంటి స్టార్ నటుడు ఈ సినిమాలో ఉండడంతో అక్కడి వారికి ఈజీగా కనెక్ట్ అవుతుందని భావించామని.. కాని ఫలితం చూసి తాము ఏ విషయంలో తప్పు చేశామో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ధనుష్ బిచ్చగాడిగా నటించిన తీరు, ఒక పేదవాడి నుంచి ధనవంతుడిగా మారే ప్రయాణం, శేఖర్ కమ్ముల నరేటివ్ స్టైల్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించి, మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అయితే నాగార్జున భార్యగా సినిమాలో కనిపించిన ఆ చిన్నదాని పాత్ర గుర్తుందా? నటన పరంగా కొంత సమయం మాత్రమే స్క్రీన్‌పై కనిపించినా, తన నటనతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో తెలుసా? పేరు సునయన ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు స్పరిచితురాలే.. 2005లో వచ్చిన సంథింగ్ స్పెషల్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఆతర్వాత 10th క్లాస్ అనే సినిమాలో నటించింది. ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించి అలరించింది. తెలుగులో మొన్నామధ్య రాజరాజ చోర సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు కుబేర సినిమాలో మెరిసింది.అందం అభినయం ఉన్న ఈ చిన్నది ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక కుబేర సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునయన తన క్యూట్ ఫొటోలతో కట్టిపడేస్తుంది. ప్రస్తతం ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హరి హర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది.. ఇంకా రికార్డులన్నీ రప్ప…రప్ప…










