Baby Girl | మూడు రోజుల ఆడ శిశువును చెత్త బుట్టలో పడేసిన తల్లిదండ్రులు..?
Baby Girl | అప్పుడే పుట్టిన ఆడ శిశువును కన్న తల్లి కనికరం లేకుండా కర్కశంగా చెట్ల పొదల్లో పడేసింది. శిశువు ఏడుపు విన్న ఓఆటో డ్రైవర్ పొదల మధ్య ఉన్న శిశువును చూసి స్థానికులకు తెలుపగా చీమలు కొరికి, ముళ్లు గుచ్చుకుని రక్తపు మడుగులో అల్లాడుతున్న శిశువును పోలీసులకు అప్పసచెప్పారు. అసలు కధలోకి వెళ్తే వీ ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని టక్కా కాలనీలో రోడ్డు పక్కన నీలిరంగు బుట్టలో శిశువు పడి ఉందని స్థానికుడు శనివారం పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారిని అక్కడి నుంచి తమ వద్దకు తీసుకున్నారని ఒక అధికారి తెలిపారు.బుట్టలో ఇంగ్లీషులో రాసిన ఒక నోట్ కూడా దొరికింది. అందులో నవజాత శిశువు తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, దీనివల్ల తాము బిడ్డను పెంచలేమని పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు నోట్‌లో “క్షమించండి” అని పేర్కొన్నారు.

తమకు వేరే మార్గం కనిపించలేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు లేఖలో తెలిపారు. పోలీసులు ఆ నవజాత శిశువును పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించగా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తేలింది. నవజాత శిశువును విడిచిపెట్టారనే ఆరోపణలపై పన్వెల్ టౌన్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల కోసం వెతుకుతామని పోలీసుల తెలిపారు.










