Thammudu Movie Review | తమ్ముడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.
Thammudu Movie Review | ఐదేళ్ల కిందట వచ్చిన ‘భీష్మ’ తర్వాత యువ కథానాయకుడు నితిన్ హిట్టు ముఖమే చూడలేదు. మధ్యలో అతడి సినిమాలు అరడజనుదాకా వచ్చాయి.. వెళ్లాయి. ఇప్పుడతను ‘తమ్ముడు’తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
జై (నితిన్) తను వరల్డ్ ఆర్చరీ (విలు విద్య) లో ఛాంపియన్ కావలనుకుంటాడు. కానీ తన గురి మాత్రం ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దీనితో తను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన కుటుంబం అక్క స్నేహాలత (లయ) విషయంలో జరిగిన ట్రాజడీ అని తెలుసుకుంటాడు. దీనితో తన ప్రాణ స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ) తో తన అక్క, కుటుంబం అంబరాలగుడి అనే ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని స్టార్ట్ అవుతాడు. ఇంకోపక్క వైజాగ్ లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం దాని ఓనర్ అజర్వాల్ (సౌరబ్) దాని నుంచి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాలు ఏంటి? దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏంటి? నితిన్ తన అక్కతో కలిసాడా లేదా? చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫెర్మెన్స్
జై పాత్రలో నితిన్ బాగా చేశాడు. గత చిత్రాలతో పోల్చితే బాగా నటించాడు. చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. యాక్టింగ్ పరంగానూ చాలా బెటర్ ఔట్పుట్ ఇచ్చాడు. అదరగొట్టాడు. ఇక ఝాన్సీ పాత్రలో లయ బాగా సెట్ అయ్యింది. తను మాత్రమే చేయగలదు అనేలా ఆమె పాత్ర ఉంది. అంతే హుందాగా ఉంది. ఆమె సైతం సహజంగా చేసి మెప్పించింది. నటిగా ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసింది.వీరితోపాటు రత్నగా సప్తమి గౌడ కూడా ఉన్నంత సేపు ఆకట్టుకుంది. ఆమె పాత్రలో రొమాన్స్, కామెడీ బాగుంది. మరోవైపు చైత్రగా వర్షా బొల్లమ్మ అదరగొట్టింది. యాక్షన్ లో ఆమె ఇరగదీసింది.గుత్తిగా స్వసిక కూడా అదరగొట్టింది. విలన్ పాత్రలో సౌరభ్ సచదేవ తనదైన విలనిజం చూపించి మెప్పించారు. కానీ చివరికి ఆయన ముగింపు తేలిపోయినట్టుగా ఉంది. హరితేజ పాత్ర కూడా బాగుంది.
మూడు రోజుల ఆడ శిశువును చెత్త బుట్టలో పడేసిన తల్లిదండ్రులు..?

మిగిలిన పాత్రలు ఉన్నంతలో మెప్పించాయని చెప్పొచ్చు.సినిమాకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ బిజీయం మాత్రం ఆయన రేంజ్లో లేదు. సినిమాలో ఆ స్థాయి ఎలిమెంట్లు లేకపోవడమా? ఏమోగానీ తన మార్క్ మిస్ అయ్యిందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల మాత్రం అదరగొట్టాడు. ఇక కేవీ గుహన్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌కి ఇంకా పని చెప్పాల్సింది. ఇంకా బాగా కట్ చేయాల్సింది.దర్శకుడు వేణు శ్రీరామ్ రాసుకున్న కథ బాగుంది. దాన్ని అంతే కొత్తగా, అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో తడబడ్డాడు. యాక్షన్ సీన్లు బాగా చేసుకున్నారు,కానీ సినిమా కథని నడిపించే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సెకండాఫ్ తరహాలో ఫస్టాఫ్‌ని కూడా డీల్ చేస్తే, ఎమోషనల్‌గా ఇంకా బాగా తీస్తే సినిమా ఇంకా బాగుండేది.
చివరిగా అక్క మాట కోసం తమ్ముడి పోరాటం. రేటింగ్ : 2.5










