Shanthi Swaroop | పాపం ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం ఇదే ,
Shanthi Swaroop | జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో శాంతిస్వరూప్ ఒకరు. శాంతిస్వరూప్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. శాంతిస్వరూప్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. శాంతిస్వరూప్ కు సినిమాలలో కూడా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే శాంతిస్వరూప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రముఖ కమెడియన్ ఇంటిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
మొదట జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన శాంతి అలియాస్ శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో నటిస్తూ అందరినీ అలరిస్తున్నాడు. లేడీ గెటప్ లో శాంతి స్వరూప్ ఎన్నో స్కిట్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తన కామెడీతో కోట్ల మంది ప్రేక్షకులను నవ్విస్తున్న శాంతి స్వరూప్.. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా శాంతి స్వరూప్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శాంతి స్వరూప్ తనకు ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మేస్తున్నా అని.. ఇది తన తల్లి ఆపరేషన్ కోసం అని ఆవేదనగా చెబుతున్నాడు.

గతకొంత కాలంగా శాంతి స్వరూప్ తల్లిగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో తన వద్ద డబ్బు లేక తనకంటూ మిగిలిన ఒక్క ఇల్లు అమ్మేస్తున్నట్లు శాంతి స్వరూప్ వీడియో ద్వారా తెలిపారు. ఇల్లు అమ్మేస్తున్నట్లుగా తన తల్లికి తెలియదని.. ఒకవేళ తెలిస్తే ఎంతో బాధపడుతుందని చెప్పలేదని శాంతి స్వరూప్ ఇన్ స్ట్రాగామ్ వేదికగా తెలిపారు. శాంతి స్వరూప్ మాటల్లోని ఆవేదన అందరి హృదయాలు కలచివేస్తుంది. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది అమ్మకు మించిన ఆస్తి సంపద ఏదీ లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ 50లక్షలు కాదు 5పైసలు కూడా ఇవ్వలేదు .. ఫిష్ వెంకట్ కన్నీరు ..










