Rashmika Mandanna

Rashmika Mandanna | ఇప్పుడు నాచెల్లికి 13 ఏళ్లు.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

Rashmika Mandanna | స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ గా మారిపోయింది. చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత గీతగోవిందం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుంది. మహేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఆతర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది రష్మిక.ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. రీసెంట్ గా కుబేర సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఈ నేషనల్ క్రష్. అయితే రష్మికాకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మికకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై రష్మిక స్పందించారు.

సంచలనం నయనతార-విఘ్నేష్‌లు విడాకులు .. అసలు ఏం జరిగినది అంటే..?

“నేను ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్లలేదు. నాకు ఒక చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. నేను కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఈ సమయంలో నేను తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఈ విషయం నన్ను ఎంతో బాధిస్తోంది” అని చెప్పుకొచ్చారు. బిజీ షెడ్యూల్స్ వల్ల స్నేహితులకు కూడా దూరమయ్యానని, ఒకప్పుడు విహారయాత్రలకు పిలిచే స్నేహితులు కూడా ఇప్పుడు తనకు సమయం ఉండదని భావించి పిలవడం మానేశారని వాపోయారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన మాటలను రష్మిక గుర్తుచేసుకున్నారు. “కెరీర్‌లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని, అదే వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే కెరీర్‌లో కొన్నింటిని వదులుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కానీ నేను మాత్రం ఈ రెండింటినీ సమన్వయం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను” అని తెలిపారు.ప్రస్తుతం రష్మిక ఆయుష్మాన్ ఖురానాతో ‘థామా’తో పాటు ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘మైసా’ వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..