Keeravani Father | కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత.. షాక్ లో చిత్రపరిశ్రమ
Keeravani Father | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇక శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు కాగా, ఆయన 1932 అక్టోబర్ 8వ తేదీన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం ఉన్నారు.. వారి పేర్లు కీరవాణి, కల్యాణి మాలిక్, శివ శ్రీ కంచి .
ఇక శివ శక్తి దత్తాకు అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు.వారిలో ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్ శివ శక్తి తమ్ముడు. ఇక సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా ఉన్న ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న అవుతారు.తెలుగు సినిమాల్లో సంస్కృత ఆధారిత పాటలు రాయడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు శివశక్తి దత్త .

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై , ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు హనుమాన్ సినిమాకు కూడా ఆయన పాటలు రాశారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన సేవలు అందించారు.ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి శివశక్తి దత్త పెద్దనాన్న అవుతారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌కు ఈయన స్వయానా సోదరుడు. శివశక్తి దత్త మరణంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దానికోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతారామం హీరోయిన్..?










