Actress Sridevi | అప్పుడే లగ్జరీ కారు కొన్న కోర్ట్ మూవీ హీరోయిన్..ఎన్ని లక్షలో తెలుసా..!
Actress Sridevi | “శ్రీదేవి”.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పేరు . కోర్టు సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలుగు అమ్మాయి శ్రీదేవి మంచి ఫామ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్ గా తనకు కోర్టు మూవీనే మొదటి సినిమా . అయినప్పటికీ బాగా ఆకట్టుకుంది . సోషల్ మీడియా ద్వార క్రేజ్ సంపాదించుకున్న శ్రీదేవి కోర్టు మూవీతో ఏకంగా సినీ స్టార్స్ ని కూడా ఫిదా చేసేసింది . తాజాగా కోలీవుడ్ సినిమా నుంచి బంపర్ ఆఫర్ అందుకుంది . శ్రీదేవి రెండో సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమాతోనే మెప్పించిన తెలుగు అమ్మాయి ఇప్పుడు కోలీవుడ్లో ఏకంగా బడా నిర్మాత సరసన నటించబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .సోషల్ మీడుయాలో పలు వీడియో ద్వార పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ..ఈ కోర్టు మూవీ ద్వారనే హీరోయిన్ గా తన లక్ ని పరీక్షించుకుంది.అది పక్కన పెడితే శ్రీదేవి తాజాగా కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది.

కొత్త కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ హెక్టార్ కారును పోస్ట్ చేసింది శ్రీదేవి. ఈ కారు ధర రూ.25 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే తన అనుకున్న కలను నెరవేర్చుకుంది. కోర్టు సినిమాకు ఈ అమ్మడు రూ.10 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సరైన క్లారిటీ రాలేదు. కానీ ఈ మూవీతో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆమెకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ సైతం పెరిగారు. అలాగే ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: సీరియల్ లో పద్ధతిగా ఉండే గుప్పెడంత మనసు హీరోయిన్..










