Kurnool Diamond | రైతు పొలంలో దొరికిన వజ్రాలు.. ఎన్ని లక్షలు అంటే?
Kurnool Diamond | ఒక్క వజ్రం దొరికితే చాలు తమ జాతకం మారిపోతుందని చాలా మంది ఆశగా వెతుకుతారు. దేవుడు కరుణిస్తే తలరాతలు మారిపోతాయేమోనని ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సాధారణంగా జూన్ లో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. కానీ, ఈ సారి మాత్రం కాస్త ముందుగానే వజ్రాల వేట మొదలైంది.ముఖ్యంగా కర్నూలు జిల్లా (Kurnool district) తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతులకు వజ్రాలు కనిపించాయి. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మూడు వజ్రాలు దొరికాయి. దీంతో ఆ అన్నదాతలు తెగ సంబరపడ్డారు. ఆ మూడు వజ్రాల (diamonds) విలువ 20 లక్షల వరకు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు.
ఆ రైతులకు డబ్బు అవసరం ఉందో ఏమో 15 తులాల బంగారం ఇస్తే స్థానిక వ్యాపారికి ఇచ్చేశారు. వజ్రాలు దొరికినప్పటికీ తక్కువ ధరకు విక్రయించారు.గత వారం రోజుల్లో వజ్రాలు దొరకడం ఇది ఐదోసారి. అలాగే పొలం పనులు చేస్తుండగా జొన్నగిరి, మదనంతపురం, పగిడిరాయి, దేశాయి తండా రైతులకు 10 వజ్రాలు దొరికాయి. అప్పటినుంచి వజ్రాల కోసం స్థానికులతోపాటు పక్క గ్రామాల వారు వజ్రాల వేటకు వెళుతున్నారు. గతంలో వర్షాలు సరైన క్రమంలో రాకపోవడంతో వజ్రాలు తక్కువ దొరికేవి.

ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు రావడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో చాలా వజ్రాలలు దోరుకుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం వజ్రాల అన్వేషణ కోసం భారీగా జొన్నగిరి పగిడిరాయి, పెరవలి ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఒకసారి తమ అదృష్టం పరీక్షించుకోవడానికి చిన్నాపెద్దా, మహిళలు, ఉద్యోగులు అందరూ వజ్రాల వేట కోసం భారీగా జొన్నగిరికి తరలి వస్తున్నారు. ఏకంగా పత్తికొండ, గుత్తి, ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు లాడ్జిల్లో ఉంటూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వజ్రాలు వెతికి మళ్ళీ సాయంత్రం లాడ్జులకు చేరుకుని బసచేస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ అదృష్టం తమ తలరాతలు మారిపోతాయని అంటున్నారు వజ్రాల అన్వేషకులు.
సీరియల్ లో పద్ధతిగా ఉండే గుప్పెడంత మనసు హీరోయిన్.. బయట మాత్రం










