Anchor Anasuya Bharadwaj

Anchor Anasuya |40 ఏళ్లు అయినా మళ్లీ తల్లిని కావాలని ఉంది.. అనసూయ

Anchor Anasuya |టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ గురించి తెలియని వారు లేరు. ఒకప్పుడు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ, ఇప్పుడు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా మూవీ తో అనసూయ మరింత గుర్తింపు పొందింది. ఆ తరువాత సినిమాల మీద పూర్తిగా దృష్టి పెట్టిన అనసూయ, స్టార్ యాంకర్‌ నుంచి టాలీవుడ్ స్టార్ పాత్రల నటి వరకు ఎదిగింది.రామ్ చరణ్ రంగస్థలం, పుష్ప 1 లాంటి చిత్రాలలో అనసూయ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల పుష్ప2: ది రూల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అనసూయకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ హిట్ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

సినిమాలలో తో పాటు అనసూయ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.సినిమాల్లో నటిస్తూనే కుటుంబానికి సమయం కేటాయించడం అనసూయ ప్రత్యేకత. తరచూ కుటుంబంతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లే ఆమె, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఆనందంగా గడుపుతున్న అనసూయ, తాజాగా తన మూడో ప్రెగ్నెన్సీ కు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తాజాగా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అనసూయ మరోసారి తల్లి కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దానికీ ఓ కారణం ఉంది.

Anchor Anasuya Bharadwaj
Anchor Anasuya Bharadwaj

ఎందుకంటే అనసూయ తండ్రికి ముగ్గురూ ఆడపిల్లలే. అందువల్ల తనకు పెళ్లైన తర్వాత ఫస్ట్ అబ్బాయి, రెండో సారి అమ్మాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట. ఆమె అనుకున్నట్లుగానే మొదట అబ్బాయి పుట్టాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆ తర్వాత కూడా రెండో సంతానంగా అబ్బాయే పుట్టడంతో ఒకింత నిరాశ చెందిందట.దీంతో కూతురు కోసం అనసూయ మరో సారి తల్లి కావడానికి రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు అయినా పర్వాలేదు.. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు అంటున్నట్లు సమాచారం. ఎవరు ఏం అనుకున్నా అమ్మాయిని కనేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానంటు చెబుతున్నట్లు తెలిసింది. అయితే వ్యాఖ్యలన్నీ గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ చేసింది.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..