Sr NTR Food Habits

Sr NTR Food Habits | నాటుకోడితో 20 ఇడ్లీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

Sr NTR Food Habits | ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అనేక గొప్ప విషయాలు ఉన్నాయి నటుడిగా, రాజకీయవేత్తగా రెండు రంగాల్లో ఆయన విజయం సాధించి చూపించారు. దశాబ్దాల పాటు ఆయన ప్రస్థానం సాగింది. తెలుగువారి ఆత్మగౌరవంగా ఎన్టీఆర్ ని కొనియాడుతారు.వాటిలో క్రమశిక్షణ కూడా ఒకటి. ఆ రోజుల్లో తెల్లవారుజామున షూటింగ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు. చెప్పిన సమయానికి ఒక నిమిషం ముందే ఎన్టీఆర్ సెట్స్ లో ఉండేవారట. దీని కోసం ఆయన ఉదయం 3 లేదా 4 గంటలకే నిద్రలేచేవారట.ఆయన ఆహారపు అలవాట్ల గురించి పచ్చల ప్రకాష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పచ్చల ప్రకాష్ ఎన్టీఆర్ ని చాలా దగ్గరగా చూశారు. ఎన్టీఆర్ సినిమాలకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఆయన పని చేశారు.

Sr NTR Food Habits
Sr NTR Food Habits

ఎన్టీఆర్ తో ఆయనకు మంచి అనుబంధం ఉందట. నాదేశం మూవీ విడుదలైన తదుపరి ఏడాది ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అప్పుడు ఆయనకు భోజనం తయారు చేయించే బాధ్యత నాకు దక్కిందని ప్రకాష్ అన్నారు. ముఖ్యమంత్రి కావడంతో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. అందుకే బాగా నమ్మిన నాకు ఆయనకు భోజనం ఏర్పాటు చేసే బాధ్యత ఇచ్చారని ప్రకాష్ వెల్లడించారు.ఇక ఎన్టీఆర్ దిన చర్య, ఆహారపు అలవాట్లు గురించి చెబుతూ… ఉదయం 4 గంటలకే నిద్ర లేచేవారట. ఎన్టీఆర్ 5.30 వరకూ కసరత్తులు చేసిన స్నానం పూజ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ కు రెడీ అయ్యేవారట. ఇక ఒక్కోసారి 5 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చేసేవారట. లేదంటే 6 గంటలకు తినేవారట.

అప్పుడే లగ్జరీ కారు కొన్న కోర్ట్ మూవీ హీరోయిన్..ఎన్ని లక్షలో తెలుసా..!

 20 ఇడ్లీలు, 2 లీటర్ల యాపిల్ జూస్

అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట. ఇడ్లీతో నాటుకోడిని నంజుకోవడం అంటే పెద్దాయనకు ఎంతో ఇష్టమట. అంతే కాదు ఒక కోడిని తందూరి చేయించి తినేవారట. ఆ కోడిని ఆయన భార్య బసవతారకం చేసిపెట్టేవారట. కాని కొన్ని రోజులు మాత్రం ఈరోజు కోడి వద్దు అని భార్యకు చెప్పేవారట ఎన్టీఆర్. అప్పుడు ఆమె తోటకూరు వెల్లుల్లి కారం తో పాటు మరికొన్ని వెజ్ వెరైటీలు చేసి పెట్టేవారట. అలా ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ గా ఉండేవని తెలుస్తోంది. యాపిల్ జ్యూస్ అంటే ప్రాణం అంట.. ఆయన ఎక్కువగా ఆపిల్ జ్యూస్ తాగేవారట. మద్రాసులో ఉన్న టైమ్ లో యాపిల్స్ ఎక్కువగా ఎక్కడ బాగుంటాయో కనుక్కుని మరీ.. అక్కడి నుంచి తెప్పించుకునేవారట.

Sr NTR Food Habits
Sr NTR Food Habits

అంతే కాదు షూటింగ్ టైమ్ లో కూడా ఎంత బిజీగా ఉన్నా.. తోటి నటులతో ఫుడ్ గురించి డిస్కర్షన్లు జరిగేవట. రోజుకు 3 నుంచి 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్ లో ఈ కోటా పెరిగేదట. ఇక సమ్మర్ వస్తే ఆయన ఫుడ్ లో కాస్త మార్పులు జరిగేవని తెలుస్తోంది. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన తీసుకునే వారట సాయంత్రం స్నాక్స్ గా బజ్జీలు, అప్పుడప్పుడు డ్రైఫ్రూట్స్ ను కూడా ఎన్టీఆర్ తీసుకునేవారట. ఇక వెజ్ మీల్స్ అయితే గోంగూర, నెయ్యి, రెండు రకాల కూరలు, చారు, అప్పడం, పెరుగు, ఖచ్చితంగా ఉండాల్సిందే.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..