MB Chowdary | నాకు యాక్సిడెంట్ నా పళ్ళు లిప్ కట్ అయింది.. MB చౌదరి
MB Chowdary | న్యూస్ ప్రజెంటర్ గా, ఇన్ ఫ్లుయెన్సర్ గా యూట్యూబర్ గా ఫేమస్ అయినటువంటి ఎంబి చౌదరి తాజాగ సుమన్ టివి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. యాంకర్ రోషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన పూర్తి పేరు ముమ్మనేని భారతి చౌదరిగా చెప్పుకొచ్చింది. తనకు నటి సౌందర్య రోల్ మోడల్ అని తెలిపింది. ఇదిలా ఉండగా సౌందర్య పాటలకు ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది ఎంబి చౌదరి.
అప్పుడే లగ్జరీ కారు కొన్న కోర్ట్ మూవీ హీరోయిన్..ఎన్ని లక్షలో తెలుసా..!
తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్తూ.. ఓ రోజు న్యూస్ కవరేజ్ కోసం స్కూటీ పై వెళ్తుండగా వెనక నుంచి కారు ఢీకొట్టిందని దాంతో తనకు తీవ్రగాయాలయ్యాయని తెలిపింది. ఆ ప్రమాదంలో పళ్లు విరిగి, లిప్ కట్ అయిపోయి గాయాలపాలయ్యానని తెలిపింది. భగవంతుడి దయ వల్ల త్వరగా కోలుకున్నానని చెప్పింది. ఇక సన్నగా ఉండే తను ప్రమాదం తరువాత మెడిసిన్ వాడకం వల్ల బరువు పెరిగానని తెలిపింది. తన జీవితంలో ఇదే పెద్ద విషాద ఘటన అని చెప్పుకొచ్చింది ఎంబి చౌదరి.

నిజానికి వాహనదారుల నిర్లక్ష్యం వల్లనో లేక అజాగ్రత్త వల్లనో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా షూటింగ్ ల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు, న్యూస్ కవరేజ్ కోసం వెళ్లే మీడియా రంగం వారు అనుకోకుండా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇటీవల పుష్ప టీమ్ షూటింగ్ వెళ్తుండగా వారు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఇక నటీ నటుల విషయానికి వస్తే ఫైట్ సీన్లు చేసేటపుడు ప్రమాదాలకు గురై గాయాలపాలైన సంఘటనలు చాలానే ఉన్నాయి.
https://www.facebook.com/watch/?v=768961308358652










