Fish Venkat | ఫిష్ వెంకట్‌కు విశ్వక్ సేన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం..
Fish Venkat | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో గుర్తింపు పొందిన వెంకట్, ఆ తరువాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించారు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్న ఆయన కుటుంబం సహాయం చేయాలంటూ దాతలను కోరుతూ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకట్ భార్య మాట్లాడుతూ, “ప్రస్తుతం పరిచయస్తులు ఎవరూ ఆయనను చూడటానికి కూడా రావడం లేదు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం మద్యం వల్ల షుగర్, కాలు ఇన్‌ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.ఆ సమయంలో వెంకట్‌కు పలువురు సినీ ప్రముఖులు, దాతల సాయం చేయడంతో ఆపరేషన్ జరిగి ప్రాణాలు దక్కాయి. కానీ ఆపరేషన్ తరువాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా కష్టాల్లో పడ్డారు.

తిరిగి మద్యం, ధూమపానం అలవాట్లు వదలలేకపోవడంతో ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని ఆయన భార్య వాపోయారు.అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న వారు వెంకట్ చికిత్స కోసం సాయం చేయాలని దాతలను చేతులెత్తి మొక్కుతున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు కనీసం రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, తమ వద్ద అంత డబ్బు లేదని, సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె స్రవంతి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫిష్ వెంకట్ కు అండగా నిలిచారు. చికిత్స కోసం రూ. 2లక్షలను పంపించారు. ఈ మేరకు చెక్కును తన టీమ్ ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
RELATED ARTICLE సెగలు పుట్టిస్తున్న సమంత అందాలు..మీరు చూడండి..










