Arunachalam

Arunachalam | రూ.500 కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణలో భక్తుడి దారుణ హత్య..?

Arunachalam | అరుణాచలం.. గత కొంత కాలంగా తెలుగు భక్తులు ఎక్కువగా వెళ్తున్న ఆలయం. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఈ ఆలయానికి జనాలు పోటెత్తుతారు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి తమ ముక్కులు చెల్లించుకుంటారు. తమిళనాడులోని తిరువణ్ణామలై పట్టణంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నికి ప్రతీక. అయితే అరుణాచలం వెళ్లిన ఓ తెలుగు భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్‌ (32) తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు.

\ఈ క్రమంలో ఇద్దరు యువకులు అతన్ని అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి విద్యాసాగర్‌ నిరాకరించడంతో కోపంలో ఉన్న ఆ ఇద్దరు యువకులు విద్యాసాగర్‌ ను కత్తితో గొంతు కోసి హత్య చేసి అతని వద్ద నుండి సుమారు రూ.5,000 లాక్కొని అక్కడి నుండి పారిపోయారు.

Arunachalam
Arunachalam

అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యాసాగర్‌ ను వెంటనే తోటి భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగ్‌లను పరిశీలించిన పోలీసులు విచారణలో, తిరువణ్ణామలైకి చెందిన కుగణేశ్వరన్ (21), తమిళరసన్ (25) విద్యాసాగర్ నుండి డబ్బును లాక్కొని పారిపోయారని తేలింది వారిని అదుపులోకి తీసుకున్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..