Heroine Laya | అమెరికాలో నటి లయ నెల జీతం తెలిస్తే మైండ్‌బ్లాకే!
Heroine Laya | అమెరికాలో నటి లయ నెల జీతం తెలిస్తే మైండ్‌బ్లాకే!టాలీవుడ్ లో నటన ద్వారా ఇండస్ట్రీ లో నెగ్గుకొచ్చే హీరోయిన్లు దొరకడం చాలా అరుదు,అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ.అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కనబరిచే లయ బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, ఇందులో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను, లయ కి ఉత్తమ నటిగా ‘నంది అవార్డు’ దక్కింది.అలా తొలి సినిమాతోనే నంది అవార్డు లాంటి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఏకైక హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది లయ.

కెరీర్ లో ఏడాదికి 8 సినిమాలు చేసే లయ 2006 వ సంవత్సరం లో అమెరికా కి చెందిన ఒక డాక్టర్ ని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయి సినిమాలకు గుడ్ బై చెప్పేసారు.సినిమాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత ఈమె 2011 వ సంవత్సరం నుండి సాఫ్ట్ వేర్ రంగం లో ఉద్యోగం చేసేడట.ప్రముఖ MNC కంపెనీ లో డెవలపర్ జాబ్ చేసే లయ నెలకి 12000 డాలర్లు సంపాదించేదట.అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 9 లక్షల 40 వేల రూపాయిలు అన్నమాట.2017 వరకు ఉద్యోగం చేసిందట,ఆ తర్వాత ఆ జాబ్ మానేసి స్వయంగా ఒక డ్యాన్స్ స్కూల్ ని ఏర్పాటు చేసిందట,
Also read : రూ.500 కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణలో భక్తుడి దారుణ హత్య..?
కరోనా వచ్చినప్పుడు ఈ స్కూల్ కూడా మూసి వెయ్యాల్సి వచ్చిందట.అప్పటి నుండి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ నెటిజెన్స్ కి బాగా పరిచయం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది లయ.చాలా కాలం తర్వాత ఇండియాలోకి అడుగుపెట్టిన లయ,ఈమధ్య వరుసగా ఇంటర్వ్యూస్ ఇచ్చింది, ఈ ఇంటర్వ్యూస్ లో ఈమె తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది, అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఏడుసార్లు స్టేట్ ఛాంపియన్
తాను రెండో తరగతి నుంచే చదరంగం ఆడటం ప్రారంభించానని లయ తెలిపారు. పట్టుదలతో సాధన చేసి ఏడుసార్లు రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా, జాతీయ స్థాయిలో పతకాన్ని కూడా కైవసం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. అయితే, పదో తరగతి తర్వాత చదువుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో గంటల తరబడి సాగే కోచింగ్‌కు వెళ్లలేక చదరంగానికి దూరమవ్వాల్సి వచ్చిందని ఆమె వివరించారు.పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన లయ, ‘తమ్ముడు’ చిత్రంతో విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మూడు నంది అవార్డులు అందుకున్న నటిగా రికార్డు సృష్టించిన లయ, ఇప్పుడు తనలోని ఈ కొత్త కోణాన్ని పరిచయం చేసి అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నారు.










