Urfi Javed Surgery | వాటి కోసం సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్..?
Urfi Javed Surgery | బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఈక్రమంలోనూ ఉర్ఫీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. అక్కడ పలు టాస్కులు ఆడిన ఆమె విన్నర్ కాలేకపోయింది. కొద్ది రోజులకే బయటకు వచ్చేసి తన ఫ్యాషన్‌తో విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. వెరైటీ డ్రెస్సులు ధరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత కొద్ది కాలంగా ఉర్ఫీ ఏ సినిమాలు షోలు చేయనప్పటికీ సోషల్ మీడియా ద్వారానే చాలామంది ఫాలోవర్స్‌ను రాబట్టుకుంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది. వారానికి రెండు వెరైటీ డ్రెస్సులు అయినా తయారు చేయించుకుని రోడ్లపై తిరుగుతూ ట్రోల్స్‌కు గురవుతుంటుంది.
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఉర్ఫీ ముఖం ఉబ్బిపోయి, పెదాలు ఎర్రగా కందిపోయి కనిపించాయి. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు షాక్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం ఉర్ఫీ జావెద్ లిప్ సర్జరీ చేయించుకున్నారు. అది ఆ సమయంలోనే వికటించడంతో పెదవుల లుక్ మారిపోయి.. ఫేస్ ఉబ్బిపోయి కనిపించింది. ఆ తర్వాత అవి సరిచేసుకోవడంతో తిరిగి యథాస్థానానికి చేరుకున్నాయి. అయితే లిప్ ఫిల్లర్స్ ఎప్పటికప్పుడు ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ లిప్ ఫిల్లర్లని తాను కరిగించుకున్నానని.. ఎవరూ తనలా చేయొద్దని, అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లాలని ఉర్ఫీ జావెద్ సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉర్ఫీ జావేద్ ముందుగా టీవీ నటిగా కెరీర్ ను మొదలు పెట్టి ఆతర్వాత బిగ్ బాస్ లో పేరుతెచ్చుకుంది. అయితే ఈ లిఫ్ ఫిల్లర్ 9 ఏళ్లక్రితం జరిగిందని ఇప్పుడు మీడియాకు తెలియజేసింది. లిప్ ఫిల్లర్ చేయించుకున్న తర్వాత పెదవులు దారుణంగా మారాయని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లకు పెదవులు నార్మల్ పొజిషన్ కు వచ్చాయని తెలియజేసింది. లిప్ ఫిల్లర్ బెడిసి కొట్టిన తర్వాత నారూపాన్ని నేను చూసి బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉర్పి ఫొటోలు వైరల్ గా మారాయి.

Related Post : డబ్బులిస్తే సినిమా కోసం ఏపనైనా ఓకే.. బలగం హీరోయిన్ కామెంట్స్..










