Hari Hara Veera Mallu Review | పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్.. కానీ?
Hari Hara Veera Mallu Review | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ అంచనాలతో ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే జూలై 23న ప్రీమియర్స్ వేయనున్నారు.అయితే యుట్యుబర్ నా అన్వేష్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్ ఉందని, థియేరటర్లో గూస్ బమ్స్ వస్తున్నాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని అన్నాడు.
సినిమా విజయనగరం సామాజ్యం గురించి ఉందని.. హిస్టారిక్ కథలో పవన్ అద్భుతంగా నటించాడని నా అన్వేష్ చెప్పుకొచ్చాడు.‘హరిహర వీరమల్లు’ మొదటి 15 నిమిషాలకే అందరూ కథలో ఇన్వాల్వ్ అయిపోతారట. దాదాపు 20 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందట.ఆ తర్వాత ప్రేమ కథ, కామెడీ సన్నివేశాలు వస్తాయట.ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద వచ్చే ఒక ఫైట్ అందరినీ ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయట. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అని అంటున్నారు.

మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్, పొలిటికల్ సెటైర్స్, సనాతన ధర్మం గురించి వచ్చే డైలాగులు పవన్ వీరాభిమానులు మెచ్చే విధంగా ఉంటాయని నా అన్వేష్ చెప్పుకొచ్చాడు.తర్వాత అదంతా ఫేక్ అని ట్విస్ట్ ఇచ్చాడు నా అన్వేష్. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాడు. అసలు సినిమానే అతను చూడలేదని వీడియోలో చెప్పాడు నా అన్వేష్. మూవీ రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలని ఈ వీడియో చేశానని చెప్పి ఓ పెద్ద షాక్ ఇచ్చాడు.గతంలో నా అన్వేష్ యూటూబర్ల చేస్తున్న బెట్టింగ్ యాప్‌లపై పోరాటం చేశాడు. ప్రస్తుతం అతను మూవీ రివ్యూలను అరికట్టేందుకు ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. రివ్యూస్ ఇచ్చే వారిపై బూతులతో రెచ్చిపోయాడు నా అన్వేష్. సినిమా రివ్యూలను అసలు పట్టించుకోవద్దని ప్రేక్షకులను కోరాడు.










