YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy | ఆస్కామ్ లో జగన్ జైలుకు వెళ్లడం మాత్రం ఫిక్స్..?

YS Jagan Mohan Reddy | అనుకోని ఘటనలు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. బిగినింగ్ లోనే ఇలా ఉంటే.. ఎండింగ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. ఎందుకంటే కరడుగట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇక ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కూడా. జగన్ ను జైల్లో వేస్తే వైసీపీ అస్సలు ఉండదన్న అంచనాలో ప్రత్యర్ధి పార్టీల అగ్రనేతలున్నారు. కేవలం ఒక్కసారి ఓటమితోనే అనేక మంది నేతలు పార్టీని వీడుతుండటంతో ఇక ఈసారి జైలుకెళితే ఒక్కరూ మిగలరన్న అంచనాల్లో అధినాయకులు ఉన్నట్లే కనిపిస్తుంది.

జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని ఆయన తెలిపారు.లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకు వెళ్లడం, చిప్పకూడు తినడం తప్పదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఇదే కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే జగన్ రోజూ మీడియా ముందుకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.కాగా, లిక్కర్ స్కాం ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం పేరిట ప్రభుత్వం బేతాళ కథలు చెబుతోందని, అక్రమ కేసులు బనాయించి, అరెస్టులతో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ నుంచి ఇసుక వరకు ప్రతీ విషయంలోనూ అవినీతి జరుగుతోందని, ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు.

ALSO READ : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్.. కానీ?

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..