Fish Venkat

Fish Venkat | ప్రభాస్ 50లక్షలు కాదు 5పైసలు కూడా ఇవ్వలేదు .. ఫిష్ వెంక‌ట్‌ కన్నీరు ..

Fish Venkat | ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గతంలో డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో ఆరోగ్యం కొంత మెరుగుపడింది. అయితే, అంతా బాగుంది అనుకునే లోపు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆయన ఆపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మనుషుల్ని గుర్తించలేకుండా ఉన్నారని కుటుంసభ్యులు చెబుతున్నారు. ఫిష్ వెంకట్‌కు కిడ్నీ మారిస్తే తప్ప లాభం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు.

అసలే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఆయన కుటుంబానికి కిడ్నీ మార్పించటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని నటుడి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. గతంలో ఫిష్ వెంకట్ ఆస్పత్రి పాలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాయం చేశారు. చికిత్స కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చారు.అంతవరకు బాగానే ఉంది తాజాగా ఆయనకు త‌ప్ప‌నిస‌రిగా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండగా… ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలియ‌జేశారు.

అయితే ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాల‌ని కుటుంబ స‌భ్యులు వేడుకుంటున్నారు. వెంకట్ కుమార్తె సహా కుటుంబ సభ్యులు ఇప్పటికే పలుమార్లు ఆర్థిక సహాయం కోరినప్పటికీ, సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేద‌ట‌. కుటుంబం చేసిన విజ్ఞప్తికి గబ్బర్ సింగ్ గ్యాంగ్ (కొంతమంది సహనటులు) మాత్రమే స్పందించారని, మిగిలిన వారు ఎవ‌రు కూడా రెస్పాండ్ కాలేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.అయితే ప్రముఖ హీరో ప్రభాస్ ఫిష్ వెంకట్‌కు రూ. 50 లక్షల సాయం ప్రకటించారని స్థానిక, జాతీయ మీడియాల్లో వార్తలు వ‌చ్చాయి.

Fish Venkat
Fish Venkat

ఆప‌రేష‌న్‌కి కావ‌ల్సిన సాయం అందిస్తామ‌ని ప్ర‌భాస్ టీం నుండి ఒక‌రు కాల్ చేసిన‌ట్టు జోరుగా ప్ర‌చారాలు అయితే న‌డిచాయి. ఈ స‌మ‌యంలో ఆయ‌న అధికారికంగా సాయం ప్రకటించారా? ప్రభాస్ టీం నుంచి ధృవీకరణ వచ్చిందా? అనే విషయాల్లో చాలా మందికి స్పష్టత లేదు.దీనిపై కొంద‌రు ప్ర‌భాస్ టీమ్‌ని వివ‌ర‌ణ కోర‌గా, తాము కాల్ చేయ‌లేద‌ని, ఏదైన విష‌యం ఉంటే మీడియా ద్వారా తెలియ‌జేస్తామ‌ని అన్నార‌ట‌. దీంతో ప్ర‌భాస్ సాయంకి సంబంధించి వ‌చ్చిన వార్త‌లు అన్నీ ఫేక్ అని తేలింది.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..