Actress Pakeezah

Actress Pakeezah | పూట గడవక భిక్షాటన చేస్తున్న ఒకప్పటి స్టార్ న‌టి పాకీజా..

Actress Pakeezah | ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన కామెడీతో నవ్వులు పూయించిన నటి వాసుకి అలియాస్ పాకీజా స్వస్థలం కారైకుడి, తమిళనాడు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘పెదరాయుడు’, ‘అన్నమయ్య’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో జయలలిత ఆహ్వానం మేరకు అన్నాడీఎంకే పార్టీలో చేరారు. అక్కడి నుంచే నటనకు దూరమయ్యారు. జయలలిత మరణం తర్వాత ఆమెను పట్టించుకునే వారే లేరు అంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజ్‌కుమార్ అనే వ్య‌క్తి మద్యం అడిక్షన్‌తో కుటుంబ ఆస్తులను దుర్వినియోగం చేశారు.

అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొన్న వాసుగి, చివరకు భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఇల్లు కోల్పోయారు. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుండగా, ఉన్న మొత్తాన్ని ఆమె వైద్యంలో ఖర్చు పెట్టారని చెప్పారు.నాకు కనీస జీవనాధారంగా ఒక చిన్న పింఛన్ ఇచ్చినా చాలు.అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Actress Pakeezah
Actress Pakeezah

అలాగే చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాసుగిని గుంటూరులో మీడియా ప్రతినిధులు పలకరించారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రస్తుత దుర్భర పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. “తమిళనాడులో నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి ఎందరో నటులకు పంపినా ఎవరూ స్పందించలేదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు నన్ను ఆదుకున్నాయి. ఒకవేళ వారు కూడా ఆదుకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని” అని ఆమె తెలిపారు.

మీకు తెలుసా .. ఈ చిన్న వ్యాపారంతో నెలకు రూ.12 లక్షలు సంపాదన..!!

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..