Joint Pains | 30 ఏళ్లకే కీళ్ల నొప్పులు రావడాని ముఖ్యకారణం ఏమిటి అంటే..?
Joint Pains | ఈ రోజుల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఒకప్పుడు వయసుపెరిగే కొద్దీ ఈ నొప్పులు వచ్చే. ఆధునిక జీవినశైలిలో మార్పులతో చిన్న వయసు వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారికి.. వర్షాకాలం మరింత బాధాకరంగా ఉంటుంది. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ స్థాయిలు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా.. వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి కీళ్ల నొప్పులు బాధిస్తాయి.

కండరాలు గట్టిపడటం వల్ల.. ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి.కీళ్ల నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చెడు ఆహార అలవాట్ల కారణంగా.. కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువ అవుతుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగడం వల్ల కూడా కీళ్ల నొప్పు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగితే.. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. బలహీనత వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటివలన కూడా..
ఓ బ్యాంక్ మేనేజర్ కోసం.. పెళ్లైన నెల రోజులకే కొత్త అల్లుడు హత్య..
ఎక్కువసేపు కూర్చోవడం
పని ఒత్తిడి కారణంగా, చాలా మంది ఒకే చోట 8 గంటలకు పైగా కూర్చుని ఎక్కువసేపు పని చేస్తుంటారు. లేచి శరీరానికి కొంచెం విశ్రాంతి కూడా ఇవ్వరు. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఇది వెన్నునొప్పి, మోకాలి నొప్పికి దారితీస్తుంది. కాబట్టి, పని మధ్యలో ఒక చిన్న విరామం తీసుకొని శరీరాన్ని వేడెక్కించడానికి 2 నిమిషాలు నడవడం మంచిది.

కొల్లాజెన్ తీసుకోకపోవడం.
కొల్లాజెన్ అనేది ముఖ్యమైన ప్రోటీన్లలో ఒకటి. ఇది చర్మం, ఎముకలు, స్నాయువులు, గోర్లు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోతే కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. అందువల్ల కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొల్లాజెన్ లేదా దాని సప్లిమెంట్లలో అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.అలాగే కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు. దీనివల్ల మోకాళ్ల నొప్పి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు లేచి నడవాలి. మోకాళ్లకు తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది కీళ్లపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.










