Akhil Zainab | సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటున్నారు అంటే వారికి కాబోయే వధువు ఎవరు.. లేదా వరుడు ఎవరు.. వాళ్ళు బ్యాగ్రౌండ్ ఏంటి.. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి.. ఏం చేస్తూ ఉంటారు.. అని తెలుసుకోవాలని ఆసక్తి ఇండస్ట్రీలో వారి దగ్గర నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అందరిలోనూ ఉంటుంది. ఇక అలాంటిది.. ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్‌కు భార్య అంటే.. ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కచ్చితంగా ఉంటుంది.కింగ్ అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్ అక్కినేని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ మొదటగా 2016లో వ్యాపారవేత్త కూతురు శ్రియా భూపాల్ తో ప్రేమాయణం నడిపించారు.
2017లో వీరి వివాహాం కూడా చేయాలని పెద్దలు నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు జరుగుతుండగానే ఉన్నట్టుండి వారి వివాహాన్ని నిలుపుదల చేశారు. అందుకు కారణాలను కూడా ఏంటనేది చెప్పలేదు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే జైనాబ్ రవ్ద్జీతో అఖిల్ రిలేషన్ షిప్ స్టార్ చేశారు. మూడు నాలుగేళ్ల పాటు ప్రేమయాణం సాగించారు. ఇక 2014 నవంబర్ లో ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. జూన్ 6న హైదరాబాద్ లో తెలుగు సంప్రదాయం ప్రకారం అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్ద్జీ ల వివాహాం ఘనంగా జరిగింది.చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో సహా దిగేశారు. శర్వానంద్ ఒంటరిగానే పెళ్లికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కూడా ఈ పెళ్లి వేడుకల్లో భాగం అయ్యాడు.

ఇక భారాత్‌లో సుశాంత్ డ్యాన్స్ ఇరగ్గొట్టేశాడన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు జైనబ్ గురించి మరోసారి నెటిజన్లు సర్చింగ్ చేస్తున్నారు.జైనబ్ వయసు 39 అని అఖిల్ కంటే దాదాపు పదేళ్లు పెద్దది అనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఆమె గురించి గానీ, వయసు గురించి గానీ, పర్సనల్ విషయాలు గానీ ఎక్కడా అధికారికంగా కనిపించడం లేదు. ఎవరికి నచ్చినట్టుగా, తెలిసినట్టుగా వేసేసుకుంటున్నారు. ఇక నేషనల్ మీడియాలో ఏమో జైనబ్ వయసు 27 అన్నట్టుగా చెబుతున్నారు. హైదరబాద్ మూలాలున్న ఈమె ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయ్యారని తెలుస్తోంది. ముంబైలోనే రవ్‌డ్జీ ఫ్యామిలీ ఉంటోందని సమాచారం.ఇక దుబాయ్, అరబ్ కంట్రీస్‌లో వీరికి వ్యాపారాలున్నాయని అంటున్నారు.
Also Read : తీవ్ర విషాదం యజ్ఞం సినిమాల డైరెక్టర్ గుండెపోటుతో మృతి..?
వైఎస్ జగన్‌కి కూడా జైనబ్ తండ్రి జుల్పీ అత్యంత సన్నిహితులు అని సమాచారం. ఇండియా వైడ్‌గా రవ్‌డ్జీ ఫ్యామిలీ బాగానే సెటిల్ అయిందట. ఇక ఆస్తుల విషయానికి వస్తే వారికి వేల కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. జుల్ఫీకి ఒక కూతురు, ఒక కొడుకు కావడంతో భరణం కింద తన ఆస్తుల్లో సగం వాటా కూతురుకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అఖిల్‌కి కోట్ల ఆస్తులు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించగా, అదంతా కూడా చైతూ, అఖిల్‌లకే చెందుతుంది. అయితే తన వాటా ప్రకారం మనోడికి కోట్లలోనే ఆస్తి రానుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో రిచ్చెస్ట్ హీరోల్లో ఒకరిగా అఖిల్ నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
