Fruit Benifits | యాపిల్ జామ పండు..ఏది ఎక్కువ ఆరోగ్యకరంమో మీకు తెలుసా ..
Fruit Benifits | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పండ్లు, కూరగాయలు తినాలి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ..కొంతమంది మాత్రమే ఫాలో అవుతారు. మెడిసిన్ తో సంబంధం లేకుండా సహజంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి. అయితే..పండ్లు తింటే హెల్తీ అని చెప్పుకుంటున్నాం సరే. కానీ..ఏ పండు ఎలాంటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎలాంటి సమస్యలున్న వాళ్లు ఎలాంటి పండ్లు తినాలన్నదీ తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని వివరించారు న్యూట్రిషనిస్ట్ దీప్షికా జైన్. దానిమ్మ నుంచి మొదలు కొని ద్రాక్ష, బొప్పాయి..ఇలా అన్ని రకాల పండ్లలో ఉండే పోషకాల గురించి చెప్పారు. ఇదే సమయంలో ఆపిల్ vs జామ పండ్లు శరీరంలో ఏ అవయవానికి మంచి చేస్తాయన్నదీ ఎక్స్ ప్లెయిన్ చేశారు.
యాపిల్ ప్రయోజనాలు
యాపిల్ తింటే కోట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి యాపిల్‌లో కంటే.. జామకాయల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ C… ఆరెంజ్‌లో కంటే జామలో 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే పైనాపిల్‌లో కంటే జామలో ప్రోటీన్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైబర్ 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే టమాటాలో కంటే 2 రెట్లు ఎక్కువగా లైకోపీన్ ఉంటుంది. అరటిలో కంటే ఎక్కువ పొటాషియం జామలో ఉంటుంది. ఈ కారణాలు చాలవా జామ పండు రేంజ్ ఇది అని చెప్పడానికి.. యాపిల్ కంటే గ్రేట్ అని చెప్పడానికి..పైగా దీని రేటు యాపిల్ తో పోలిస్తే చాలా తక్కువ. పేద వాడి నుంచి ఉన్నోడి దాకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో దొరికే ఏకైక పండు జామ పండు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామకాయల్ని మనం గర్వంగా, గొప్పగా చెప్పుకొని తినవచ్చు.100 గ్రాముల జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు 500 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇన్ని గుణాలు మనకు ఏ పండులో ఉండవు. పైగా మనం చాలా గొప్పగా చెప్పుకునే యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ జమ కాయలో కేవలం 4వ వంతు మాత్రమే ఉంటాయి. అందుకే జామను సూపర్ ఫుడ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. జామకాయలు… డయాబెటిస్‌ను ఈజీగా కంట్రోల్‌లో ఉంచగలవు. దీన్ని తినడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. అలాగే ఇందులో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు జామకాయల్ని తింటే ఈజీగా స్లిమ్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇందులోని ఫైబర్.. ఎక్కువ ఆకలి కాకుండా కంట్రోల్ చేస్తుంది.
Also Read : ట్రైలర్ తోనే సినీ ఇండస్ట్రీని రఫ్ అడిస్తున్న కన్నప్ప.. మీకు ఎలా అనిపించింది?
జామ ప్రయోజనాలు
జామలోని B3, B6 విటమిన్లు.. రక్త ప్రసరణను పెంచుతాయి..అందువల్ల హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. ఇవి మన బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తాయి. అందువల్ల ఎలాంటి జుట్టు సమస్యలు రావు. అలాగే చాలా మందికి విపరీతంగా మొటిమలు వస్తాయి. దానికి మలబద్ధకం కూడా ఒక ప్రధాన కరణమే. ఎందుకంటే బాడీలో ఉన్న మాలినాలు ఎప్పటికప్పుడు బయటకి పోవాలి. అలా పోతే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను జామ చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే జామలోని తాజా దనం నోటి దుర్వాసనని కూడా తగ్గిస్తుంది. జామలో విటమిన్ C ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గును ఈజీగా తగ్గిస్తుంది. మన బాడీకి కావాల్సిన కొల్లాజెన్ ప్రోటీన్‌ను జామ ఇస్తుంది. ఇంకా గర్భిణీలకు జామ చాలా మంచిది. ఎందుకంటే ఇందులోని ఫోలిక్ యాసిడ్ (విటమిన్ B9), ఐరన్.. బిడ్డకు చాలా మంచిది.

అలాగే గుండెకు జామకాయలు చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో పొటాషియం ఉంటుంది.జామ కాయలు నోట్లో పుండ్లను తగ్గిస్తాయి. మన శరీరంలో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి.. రక్తపోటు (BP)ని కూడా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామని వదిలి ఎక్కువ రేటు పెట్టి ఎక్కడో కాశ్మీర్ నుంచి దిగుమతి అవుతున్న యాపిల్ కే ఎక్కువ వాల్యు ఇస్తున్నాం. దాన్ని వ్యాపారస్తులు క్యాష్ చేసుకొని ఎక్కువ రేట్లతో యాపిల్ ని అమ్మేస్తున్నారు. అంటే యాపిల్ మంచిదని కాదు.. యాపిల్ కంటే అద్భుతమైన జామ పండు మనకు అందుబాటులో దొరుకుతుంది. కాబట్టి జామని తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.










