Dil Raju Brother

Dil Raju Brother | రామ్ చరణ్ నన్ను క్షమించు.. అలాగే అభిమానులకి సారీ చెప్పిన నిర్మాత శిరీష్‌.

Dil Raju Brother | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రడ్యూసర్ శిరీష్ చేసిన కామెంట్స్ పై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న ఓ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాప్ అవడంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి యాంకర్ అడగగా.. శిరీష్ సమాధానం ఇస్తూ.. సినిమా ప్లాప్ అయిన తర్వాత కనీసం ఎలా ఉన్నారని కూడా డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్ లు ఫోన్ కూడా చేయలేదని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కాకపోతే మేం రోడ్డున పడేవాళ్లమని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన నిర్మాత శిరీష్ పై మెగా అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు, ఆ మూవీకి ప్రమోషన్స్ చేయలేదని, షూటింగ్ కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని..

ప్రేమ‌దేశం హీరో వినీత్ భార్య గురించి మీకు తెలుసా..?

చిత్రీకరణ సమయంలోనే సాంగ్ లీక్, రిలీజ్ అయిన మరోసటి రోజే మూవీ హెచ్ డీ పైరసీ కావడం.. అంతా నిర్మాతల వల్లే జరిగిందని.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మూడేళ్ల ప్రైమ్ టైమ్ ను వేస్ట్ చేశారని.. పైగా ఆయనపై నిందలు వేస్తారా? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో శిరీష్ మొదట ఓ లేఖను, తాజాగా ఓ వీడియోను విడుదల చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ, “చిరంజీవి గారికి, రామ్ చరణ్‌కు, మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు మధ్య విడదీయరాని బంధం ఉంది. నేను ఎంతో అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ వదులుకోవాలనుకోను.

Dil Raju Brother
Dil Raju Brother

అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదు” అని తెలిపారు.”అది నా తొలి ఇంటర్వ్యూ కావడంతో అలా మాట దొర్లిందేమో. మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్‌లతో కూడా మేం సినిమాలు నిర్మించాం. చిరంజీవి గారు నాతో, దిల్ రాజుతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. అంతటి అనుబంధం ఉన్న వారిని అవమానించేంత మూర్ఖుడిని కాదు. సంక్రాంతికి మా సినిమా విడుదల చేయొద్దని చరణ్ ఒక్క మాట చెప్పి ఉంటే ఆగిపోయేది. కానీ ఆయన మంచి మనసుతో మా గురించి ఆలోచించారు. అలాంటి వ్యక్తిని మేమెందుకు అవమానిస్తాం? త్వరలోనే ఆయనతో మరో సినిమా కూడా చేయబోతున్నాం. అభిమానులు దయచేసి అర్థం చేసుకోవాలి” అని శిరీష్ విజ్ఞప్తి చేశారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..