Betting Apps

Betting Apps | మంచు లక్ష్మి , రానా సహా 29 మంది సెలబ్రిటీలకు ఈడీ కేసులు?

Betting Apps | ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా.. మొదట అన్ని ఆన్‌లైన్ కంపెనీల్లాగే ఒక డొమైన్‌ను కొంటారు. వెబ్‌సైట్‌ను, యాప్‌ను డెవలప్‌ చేయించడానికి బాగానే పెట్టుబడి పెడతారు. జైపూర్, ఢిల్లీ, నొయిడా నుంచే కాదు అవసరమైతే విదేశాల్లోని మాంచి డెవలపర్స్‌ను పట్టుకుని.. గేమ్‌ డిజైనింగ్‌ నుంచి పేమెంట్ గేట్‌వే దాకా అన్ని వసతుల్ని యాప్‌లో చక్కగా తయారుచేయిస్తారు. ఆ తర్వాత.. మార్కెటింగ్‌ వ్యవస్థతో జనాల్లోకి తీసుకెళ్తారు. అందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్లకు అడిగిన దానికంటే ఎక్కువే చెల్లించి యాప్స్‌ను ప్రమోట్ చేస్తారు. అలాగే యూజర్లతో టచ్‌లో ఉండేందుకు 24 గంటలూ పనిచేసే కాల్‌సెంటర్లు కూడా నడుపుతారు.

ఇలా.. అత్యంత గోప్యంగా సాగే చీకటి సామ్రాజ్యంలా ఉంటుంది బెట్టింగ్ యాప్స్ బాగోతం.ఇక ఇప్పటికే చాలా దేశాల్లో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉంది. కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్‌కి స్వర్గధామాలుగా చెలామణీ అవుతున్నాయి.అయితే బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేసి మరీ.. ఇందులో డబ్బులు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకొని, ఆ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అయితే ఇలా బెట్టింగ్ యాప్స్ లో యువకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రమోట్ చేసే ఈ బెట్టింగ్ యాప్స్ ను ఆ సెలబ్రిటీల అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు.

Betting Apps
Betting Apps

ఈ నేపద్యంలో బెట్టింగ్ యాప్‌ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్‌ లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్‌రాజ్‌, అనన్య నాగళ్ల తో పాటు మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసారు ఈడీ అధికారులు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్‌మెంట్‌ ను రికార్డ్‌ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లగించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Kalagnanam | దడ పుట్టిస్తున్న 2028 బ్రహ్మంగారి కాలజ్ఞానం..?

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..