Illegal affair | ఓ బ్యాంక్ మేనేజర్ కోసం.. పెళ్లైన నెల రోజులకే కొత్త అల్లుడు హత్య..
Illegal affair | తిరుమలరావు అనే వ్యక్తి కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన, కల్లూరుకు చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. తరుచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐ-శ్వర్యతోనూ తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది.దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు.ఇదిలా ఉండగా ఐశ్వర్యకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్‌తో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్‌తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమలరావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు. దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 13న ఐశ్వర్య కనిపించకుండా పోయింది.

అయితే పెళ్లి ఇష్టం లేని ఆమె బ్యాంక్ మేనేజర్‌తో లేచిపోయిందని అందరూ అనుకున్నారు.కానీ 16న తిరిగి వచ్చింది. తేజేశ్వర్‌కు ఫోన్ చేసి తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని, కట్నం కోసం అమ్మ పడుతున్న బాధను చూడలేక స్నేహితురాలికి ఇంటికి వెళ్లానని నమ్మించింది. నువ్వంటే ఇష్టమని నీవు లేకుంటే బతకలేనని కన్నీళ్లు కార్చింది. కరిగిపోయిన తేజేశ్వర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పటికే ఐశ్వర్యమీద అనుమానం ఉన్నా తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లి వద్దన్నారు. కానీ అతను వినలేదు. మే 18న ఐశ్వర్యతో పెళ్లయింది. కానీ ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతోంది. దీంతో గంటల తరబడి అతనితో మాట్లాడుతుండేది. ఇద నచ్చని తేజేశ్వర్ మందలించాడు. ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : 500 నోట్లు కూడా రద్దేనా… పెద్ద కారణాలు ఇవే..

ఎలా ప్రాణం తీశారు..
తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్‌ను వారి వెంట పంపినట్టు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్‌ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక, ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. తేజేశ్వర్ హత్యతో సంబంధం ఉన్న కొందరిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై గద్వాల సీఐ టంగుటూరి శ్రీనును ‘అంధ్రజ్యోతి’ వివరణ కోరగా అనుమానితులపై నిఘా ఉంచామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.










