Sobhan Babu | చనిపోయే టైం కి శోభన్ బాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్ .
Sobhan Babu | తెలుగువారి అందాలనటుడు…అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్…ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా…డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. ఎక్కడ మొదలు పెట్టాలో…ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. వెండితెర అభిమన్యుడు శోభన్ బాబు జయంతి సందర్భంగా ఒక్కసారి అందమైన జ్నాపకాల్లోకి వెళ్దాం. శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది దైవబలం అనే జానపద చిత్రంతో. ఎన్.టి.ఆర్ హీరోగా చేసిన దైవబలంలో శోభన్ బాబు ఓ చిన్న పాత్ర ధరించారు.
శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు, పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు. నర్తనశాలలో అభిమన్యుడుగా, కృష్ణపాండవీయంలో అర్జునుడుగా నటించిన శోభన్ జానపద, పౌరాణిక పాత్రల్లో బావుంటాడనే టాక్ వచ్చేసింది.ఆతరువాత అనేక సినిమాలో చేసి స్టార్ గా ఏదిగారు. ఇకపోతే శోభన్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ మంచి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు.ఈ విధంగా హీరోగా సినిమాలలో నటిస్తూనే వ్యాపారాలు చేస్తూ శోభన్ బాబు పెద్దఎత్తున ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.ఇక ఆయన సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించిన ధనవంతుడుగా శోభన్ బాబు పేరుతెచ్చుకున్నారు.

ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ విలువైన భూములను కొనుగోలు చేయడమే కాకుండా షేర్స్ ద్వారా శోభన్ బాబు బాగా డబ్బు సంపాదించారని తెలుస్తోంది.ఈయన చనిపోయేనాటికి 50 వేల కోట్లకు పైగా ఆస్తిపాస్తులను సంపాదించారట.గతంలో శోభన్ బాబు మాట్లాడుతూ మనం ఎక్కడ డబ్బు పెట్టిన నష్టపోతామో లేదో తెలియదు కానీ ఒక భూమి పై పెట్టుబడి పెడితే ఎప్పటికీ నష్టపోమని శోభన్ బాబు అందరికీ తెలియ చేసేవారట. అందుకే ఆయన ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భూములను కొనుగోలు చేశారని ఇలా ఆ భూములకు ధరలు పలకడం వల్ల అంత పెద్ద మొత్తంలో వేల కోట్ల ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.
Also Read : అమెరికాలో నటి లయ నెల జీతం తెలిస్తే మైండ్‌బ్లాకే!










