jayasudha

jayasudha | ఆరు పదుల వయస్సులో సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ..?

jayasudha | సీనియర్ నటి జయసుధ..ఈమె పేరు చెబితే తెలియని సినీ ప్రియులు ఉండరు.. తన నటనతో సహజ నటి అనే బిరుదుని సంపాదించిన జయసుధ ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టింది. అలా సీనియర్ ఎన్టీఆర్ మొదలు కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్ఆర్ ఇలా ఎంతో మంది సీనియర్స్ తో ఆడిపడింది. ముఖ్యంగా శ్రీదేవి,జయప్రద వంటి హీరోయిన్లు టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలోనే జయసుధ వారి పోటీతత్వాన్ని నిలదొక్కుకొని ఇండస్ట్రీలో కొనసాగింది. అంతేకాకుండా శ్రీదేవి జయప్రదలు బాలీవుడ్ కి వెళ్లడంతో వాళ్లు చేసే సినిమాలు అన్ని జయసుధ దగ్గరికి వచ్చాయి. దాంతో ఈ హీరోయిన్ సౌత్ లో టాప్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన సంగతి మనకు తెలిసిందే.

ఇక గత కొద్ది రోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొన్ని రోజులు క్రితం అమెరికా వెళ్లిన జయసుధ అక్కడి బిజినెస్‌ మ్యాన్‌ను సీక్రెట్‌గా వివాహాం చేసుకున్నారని పలు వెబ్‌సైట్లలో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు జయసుధ. ఆమెతో పాటు తిరుగుతున్న వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ‘గత కొన్ని రోజులుగా నాతో పాటు తిరుగుతున్న వ్యక్తి పేరు ఫెలిపే రూయేల్స్. ఆయనది అమెరికా. నా బయోపిక్‌ తీసేందుకు ఇండియాకు వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో నా ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే నాతో పాటు ప్రతి ఈవెంట్‌కు వస్తున్నారు. ఫెలిపే ఇంటర్నెట్‌లో నా గురించి తెలుసుకున్నాడు.

jayasudha
jayasudha

అయితే నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు’ అని క్లారిటీ ఇచ్చారు జయసుధ.ఇదిలా ఉంటే జయసుధకు గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను పెళ్లాడారు. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆయన కూడా 2017లో కన్నుమూశారు. నితిన్‌ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..