Kannappa Review | కన్నప్ప సినిమా రివ్యూ అండ్ రేటింగ్,
Kannappa Review | మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సైతం కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల ముఖ్యమైన పాత్రలలో నటించారు. దీంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలుఏర్పడ్డాయి.ఇప్పటికే కన్నప్ప సినిమా గురించి చాలా మంది సినీ ప్రముఖులు గొప్పగా చెప్పారు.తాజాగా ‘కన్నప్ప’ ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
తిన్నడు(మంచు విష్ణు) అడవిలో నివసించే ఒక తెగకి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి దేవుడు లేడనే నమ్మకాన్ని పెంచుకుంటాడు. మహాదేవ శాస్త్రి(మోహన్ బాబు) స్వర్ణముఖి నది తీరంలో ఎవరకి తెలియని ఒక రహస్య ప్రదేశంలో వాయులింగాన్ని పూజిస్తూ ఉంటాడు. వాయులింగాన్ని దక్కించుకోవాలని కాలముఖ(అర్పిత్ రంక) తన వేలాది మంది సైన్యంతో ప్రయత్నిస్తాడు. వాళ్ళ ప్రయత్నాన్ని తిన్నడు తిప్పికొడతాడు. ఆ తర్వాత కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు తన మనిషిగా రుద్ర(ప్రభాస్) ని తిన్నడు వద్దకు పంపించి ఒక రహస్యాన్ని చెప్తాడు. దేవుడు లేడని నమ్మే తిన్నడు ఎందుకు వాయులింగాన్ని కాపాడాడు? అసలు చిన్న వయసులోనే దేవుడు లేడనే నమ్మకాన్ని పెంచుకోవడానికి కారణం ఏంటి? అనేదే మిగతా కధ..
Also Read : ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ పుస్తకం.. గాడ్ ఆఫ్ వార్ కోసం ఎన్టీఆర్ రెడీ.
నటీనటులు పనితీరు
కన్నప్ప క్యారక్టర్ లో మంచు విష్ణు నటించాడు అనే కంటే జీవించాడని చెప్పవచ్చు. చరిత్ర ఆధారాల ప్రకారం కన్నప్ప క్యారక్టర్ కి సంబంధించి ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయో, వాటన్నింటిలోను సూపర్ గా నటించాడు. క్లైమాక్స్ లో అయితే విష్ణు నటన నభూతో న భవిష్యతి. రుద్రగా ప్రభాస్ నటన కూడా సూపర్ గా ఉంది. అలాగే అక్షయ్ కుమార్ కళ్లల్లోని ప్రశాంతత శివుడిగా అతడిలో దైవత్వం కనిపించేందుకు దోహదపడింది. అక్షయ్ పక్కన కాజల్ అగర్వాల్ కూడా పార్వతి పాత్రలో ఒదిగిపోయింది.మంచు మోహన్ బాబు శరత్ కుమార్, బ్రహ్మాజీ, రఘుబాబు, అర్పిత్ రాంకా, బ్రహ్మానంద, సప్తగిరిలు తమ తమ పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.

అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. న్యూజిలాండ్ అందాలను సహజంగా చూపించారు. అలాగే.. వాయు లింగం ఎపిసోడ్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది.దర్శకత్వం కూడా చాలా బాగుంది.కొన్ని షాట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. విజువల్ గా కూడా కన్నప్ప తన రేంజ్ ని పెంచుకుంది. ఆ స్థాయిలో ఫొటోగ్రఫీ ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, కూడా రిపీట్ గా వినేలా ఉన్నాయి.ప్రతి ఒక్క డైలాగ్ ఆలోచింపచేసే విధంగా ఉండటంతో పాటు కన్నప్ప ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది. నిర్మాణ విలువలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే. అంత బాగా ఉన్నాయి.
రేటింగ్: 3|5










