Kannappa

Kannappa | ట్రైలర్ తోనే సినీ ఇండస్ట్రీని రఫ్ అడిస్తున్న క‌న్న‌ప్ప.. మీకు ఎలా అనిపించింది?

Kannappa | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వ‌హిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా పోస్ట‌ర్లు, టీజర్‌లు, పాటలు ‘కన్నప్ప’ పై భారీ అంచ‌నాలు పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆదిరిపోయింది అనే చెప్పాలి. ఓ గూడెం అంత శివ భక్తితో ఉంటె.. విష్ణు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటాడు. ఈ క్రమంలో అతనిలో మార్పును తీసుకుని రావడానికి సాక్ష్యాత్తు పరమశివుడు (అక్షయ్ కుమార్) తన బంటైన రుద్ర (ప్రభాస్) ని ఆ గూడెంకు పంపిస్తాడు.

ఈ ఇద్దరి మధ్య జరిగే పరిణామాలు , తర్వాత తిన్నడు కన్నప్పగా మారి శివ భక్తిలోని గొప్పదనం అది అంతా ఎలా జరిగిందో తెలియాలంటే తెరపై దీనిని చూడాల్సిందే.ట్రైలర్ లో మెయిన్ హైలెట్ ప్రభాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డార్లింగ్ ఇప్పటివరకు ఎక్కువగా మాస్ కట్ అవుట్ లోనే దర్శనం ఇచ్చాడు. కానీ ఇలా ఆధ్యాత్మికత నిండిన పాత్రల్లోనూ డార్లింగ్ ఎంతగా ఒదిగిపోగలడో ఇందులో తెలుస్తుంది. ఇక విష్ణు తాను తీసుకున్న ఛాలెంజింగ్ కంటెంట్ కు తగినట్టే చాలా వేరియేషన్స్ చూపించినట్లు తెలుస్తుంది. ఇలా ట్రైలర్ లో చూపించినట్టే కంటెంట్ కూడా ఉంటె విష్ణు అనుకున్న గోల్ రీచ్ అయినట్లే. ఇక ఏమంటుందో చూడాలి.

Kannappa
Kannappa

ఈ నేపద్యంలో హీరో మోహన్‌లాల్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఆ శివుడి అనుగ్రహం ఈ సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘మోహన్‌లాల్‌ గొప్ప నటుడు. సినిమా కోసం ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు రుణపడి ఉంటాను. ఆయనతో కలసి నటించాలనుంది’’ అని చెప్పారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. మీరు అల్రెడీ ట్రైలర్‌ చూశారు. సినిమా విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..