Kavya Kalyanram | డబ్బులిస్తే సినిమా కోసం ఏపనైనా ఓకే.. బలగం హీరోయిన్ కామెంట్స్..
Kavya Kalyanram | ఈ మధ్య కాలంలో కంటెంట్ బాగుంటే చాలు ఆటోమేటిక్ గా సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.. నిర్మాతలకు భారీగా వసూళ్లు అందించేది చిన్న సినిమాలే అని ఈ మధ్య చాలా సినిమాలు నిరూపించాయి.. మరి అలాంటి సూపర్ హిట్ సినిమాల్లో బలగం ఒకటి ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అసలు దిల్ రాజు ఇలాంటి సినిమాను ఎలా నమ్మి తీస్తున్నాడు అని అనుకుంటే రిలీజ్ తర్వాత దీని కలెక్షన్స్ చూసి అంతా కళ్ళు తేలేసారు. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
మరి ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించగా ప్రియదర్శి హీరోగా నటించాడు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయిన ఈ భామకు బాగానే పేరు వచ్చింది. అయితే తాజాగా ఈ భామ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి.ఈమె మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువగా ఇస్తే ఇంటిమేట్ సన్నివేశాలు, బోల్డ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా చేస్తానంటూ ఈమె బోల్డ్ కామెంట్స్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది..

ఈ భామ అనే కాదు ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అంతా రెమ్యునరేషన్ భారీగా ఇస్తే ఎలాంటి సన్నివేశం అయిన ఆఖరికి బికినీ వేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.. మరి ఈ భామ కూడా అదే కోవకు చెందినది అని ఆడియెన్స్ అంటున్నారు.అయితే ఈ భామ హీరోయిన్ గా తాజాగా మూడు సినిమాలు చేసింది. వాటిలో రెండు సూపర్ హిట్స్.. ఒకటి డిజాస్టర్. మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇక ఒక్క సినిమా డిజాస్టర్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది.అయితే ఆమె నిజంగానే గ్యాప్ తీసుకుందా లేక అవకాశాలు రావడంలేదా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Latest News | అమెరికాలో నటి లయ నెల జీతం తెలిస్తే మైండ్బ్లాకే!










